ఆ’షాడో’లో కోదండ

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వారంరోజుల నుంచి షాడో టీమ్‌ తన వెంట పడుతోందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు.. ప్రతిపక్ష నాయకుల వాహనాలే తనికీలు చేస్తున్నారని విమర్శించారు. అధికార పక్షం వాహనాలనూ సోదా చేయాలన్నారు. పలువురు పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించాల్సింది పోయి, కేవలం అధికార పక్షం ప్రతినిధులుగా వ్యవహరిస్తుండం సరికాదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే వాహనాలు అని తేడా చూపకుండా ప్రతి ఒక్కరి వాహనాలను తనిఖీ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. విచ్చలవిడిగా, విస్తృతంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో అత్యాధునికమైన ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రాలు ఉన్నాయని, వాట్సాప్‌ కాల్‌ను ట్యాప్‌ చేసి వినే సదు పాయం కల్పించుకున్నారన్నారు. ఈ విషయాలను ఇంటెలిజెన్స్‌ అధికారులే చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమై న విషయాలు ఫోన్‌లో మాట్లాడొద్దని సూచిస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చాక అందరివిూదా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగు తోందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేఖ తుందని, దాని నుంచి బయటపడేందుకు కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. మహా కూటమి సీట్లపై చర్చ జరుగుతుందని, ఇంకా సీట్ల పంపకం పై పూర్తిస్థాయి క్లారిటీ రాలేదన్నారు. తమకు కావాల్సిన టికెట్లను తాము అడుగుతున్నా మని, రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఇప్పటికైతే కూటమిలో ఉన్నామని, తదుపరి పరిణామాలను బట్టి తమ నిర్ణయం ఉంటుందని కోదంరామ్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here