కోదండ త్యాగం.. పొన్నాలకు జనగామ.?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ నుండి పోటీ చేయాలనే ఆలోచనను టీజేఎస్‌ చీఫ్‌ కోద్‌ండరామ్‌ విరమించుకొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఈ స్థానం నుండి గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహించాచు. పొన్నాల లక్ష్మయ్యకు తొలి జాబితాలో సీటు దక్కలేదు. దీంతో బీసీ వర్గాల్లో అసంత ప్తి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోటీ నుండి జనగామ నుండి కోదండరామ్‌ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకొన్నారు. జనగామ నుండి టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ పోటీ చేయాలని భావించారు.దరిమిలా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు ప్రకటించలేదు. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 65 స్థానాల్లో 13 మంది బీసీలకు మాత్రమే టికెట్లు కేటాయించడం, పొన్నాలకు టికెట్టు కేటాయించకపోవడంపై బీసీ సంఘాల్లో అసంత ప్తి నెలకొంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర బంద్‌ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. క ష్ణయ్య పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకే టికెట్టు రాకపోవడంపై బీసీ నేతల్లో అసంత ప్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం కూడ అంతర్మథనంలో పడింది. ఇదే విషయమై టీజేఎస్‌లో కూడ చర్చ జరిగింది. మంగళవారం నాడు సమావేశమైన టీజేఎస్‌ నేతలు కోదండరామ్‌ ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై చర్చించారు. జనగామ నుండి కోదండరామ్‌ పోటీ చేయాలనుకొన్న తరుణంలో పొన్నాల లక్ష్మయ్యను పక్కనపెట్టి కోదండరామ్‌ పోటీకి దిగితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడ టీజేఎస్‌ నేతలు భావించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జనగామ నుండి టీజేఎస్‌ పోటీ చేసే ఆలోచనను విరమించుకోవాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఇదే విషయాన్ని టీజేఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సిన సమయంలో ఇప్పటికే కాంగ్రెస్‌ జాబితాపై బీసీ వర్గాలు అసంత ప్తిగా ఉన్నందున పొన్నాల స్థానంలో కోదండరామ్‌ పోటీ చేయడం వల్ల రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ప్రయోజనమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు కూడ భావించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్యతో కూడ మంగళవారం నాడు చర్చించారు. జనగామ నుండి సీటు తనకే వస్తోందనే ధీమాతో పొన్నాల లక్ష్మయ్య కూడ ఉన్నారు. మరో వైపు టీజేఎస్‌ కూడ జనగామ బరిలో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్యకు టికెట్టుకు లైన్‌ క్లియరైంది.

స్పష్టత దొరకని కొదండ.. తమకు కేటాయించిన 11 సీట్లలో ఆరు సీట్ల విషయంలో స్పష్టత వచ్చింది, మరో ఐదు సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ ప్రకటించారు. మంగళవారం నాడు టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ప్రజా కూటమి (మహాకూటమి) పొత్తులో భాగంగా మల్కాజిగిరి, వర్ధన్నపేట, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, అంబర్‌పేట స్థానాల్లో తమకు కాంగ్రెస్‌ పార్టీ మధ్య స్పష్టత వచ్చిందన్నారు. మరో ఐదు అసెంబ్లీ స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరో వైపు తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదన్నారు. స్పష్టత రాకుండా ఎక్కడి నుండి పోటీ చేస్తాననే విషయాన్ని చెప్పలేనని కోదండరామ్‌ తేల్చి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here