Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆర్టీసీ కార్మికులతో కేకే చర్చలు..!

  • విలీనం తప్ప.. మిగిలిన డిమాండ్‌లపై సిద్ధం
  • ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదు
  • టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతుండటంతో… ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
ఇప్పటివరకు కార్మికులతో చర్చలు జరపకుండా కేవలం ప్రత్యామ్నాయాలపైనే ఫోకస్‌ పెట్టిన సర్కార్‌..
కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరింతగా చేయి దాటితే…
ఆ తరువాత పరిణామాలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం సీఎం కేసీఆర్‌…
వ్యూహాత్మంగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కే.కేశవరావును రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని,
మొండివైఖరిని విడనాడాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని, ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదు అని ఆయన స్పష్టం చేశారు.
పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్‌ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని
సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని,
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించిందని గుర్తుంచుకోవాలన్నారు.
44శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కేశవరావు పేర్కొన్నారు.
ఆర్టీసీని ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అద్దె బస్సులు, ప్రయివేటు స్టేజీ క్యారేజీల విషయంలో సీఎం కేసీఆర్‌
ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని కార్మికులకు కేశవరావు సూచించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని, ఆర్టీసీయే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వంలో
విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదని కేశవరావు స్పష్టం చేశారు.
కార్మికులు అనాలోచిత నిర్ణయాలకు వెళ్లకుండా, మొండి వైఖరిని విడనాడాలని అన్నారు.
వెంటనే ఆర్టీసీ సమ్మెను విరమించుకొని చర్చలకు సిద్ధంకావాలని కేశవరావు సూచించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close