ఘనంగా కైట్స్‌, స్వీట్‌ ఫెస్టివల్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సంక్రాంతి పండగ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు వేడుకలను నిర్వహిస్తోంది. నగరంలోని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ఆదివారం నుండి 15వ తేదీ వరకు తెలంగాణలో 4వ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ చిన్నారులతో పాటు పెద్దలు సందడి చేస్తున్నారు. 2016 నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ ఈ ఏడాది సైతం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఓ వైపు నోరు తీపిచేసే స్వీట్లు.. మరోవైపు ఆనందాన్ని పంచే కైట్లు (గాలి పటాలు) ఆకర్షించనున్నాయి. మన దేశ సంస్కృతిని చాటే విధంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. గాలిపటాల తయారీ దారులు, వర్తకులు ఈ ఏడాది బిజినెస్‌ బాగా జరగాలని కోరుకుంటున్నారు. గతంలో నగరంలో జరిగిన వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ డిజైన్లు, ఆకృతులలో గాలి పటాలు తయారు చేశారు. 20 దేశాల నుంచి 42 మంది కైట్‌ ప్లేయర్స్‌, 60 మంది దేశవాలీ కైట్‌ క్లబ్స్‌ సభ్యులు ఈ కైట్‌ ఫెస్టివల్‌కు వచ్చేస్తున్నారు. స్వీట్‌ ఫెస్టివల్‌ లో 22 దేశాలకు చెందిన 1200 రకాల వెరైటీలను ప్రదర్శిస్తారు. ఈ మూడు రోజులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శణ, సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళా ప్రదర్శణకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

మకర సంక్రాంతి అనేది పండుగలకే పండగ అని, దేశంలో పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దక్షిణాదిలో ‘పొంగల్‌’, సంక్రాంతి అని, పంజాబ్‌, హరియాణాలో లోహిరి అని, అసోంలో బిహు, బిహార్‌లో కిచిడి ఫెస్టివల్‌ అని పలు పేర్లతో ఈ పండగను పిలుచుకుంటారని చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు దేశీయ వంటకాలను తినాలని, పండుగలను జరుపుకుని సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. అంతేకానీ చికెన్‌ 65 లాంటివి తింటే 25 ఏళ్లకే 65 వయసువారిగా మారిపోతారని, రోగాలను ఆహ్వానించడమేనని పేర్కొన్నారు. కైట్స్‌, స్వీట్స్‌ ఫెస్టివల్‌ ప్రాముఖ్యతను వెంకయ్య వివరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్స్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ వేడుకలు ప్రారంభించిన అనంతరం వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఓవైపు పతంగులు, మరోవైపు స్వీట్లు అరుదైన కాంబినేషన్‌ అని మకర సంక్రాంతి నేపథ్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘భారతదేశ ప్రతి పండుగ వెనుక ఓ కారణం ఉంటుంది. జీవితం అంటే తిండి, బట్ట, పదవులే కాదు. సంగీతం, చిత్రలేఖనం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో మార్గంలో సంతోషం వస్తుంది. మనకు సంతోషాన్ని కలిగించే పండుగలలో పతంగుల పండగ ఒకటి. ఆకాశంలో ఎగరాలన్న మనిషి ఆలోచనలకు ప్రతిరూపమే గాలిపటం. క్రీడాస్ఫూర్తిగా నిదర్శనం కైట్స్‌. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్లీ కిందకి వస్తాయి. అందుకే మన మూలాలు మరిచిపోవద్దు. జీవితంలో తీపి ఉండాలి. స్వీట్‌ ఫెస్టివల్‌ మనకు తీపిని అందిస్తుంది. పుట్టినరోజు నాడు, ఉద్యోగం వచ్చినా, ఏదైనా మంచి జరిగిన సందర్భాలలో తీపిని పంచుకోవడం అలవాటే. అందుకే ఈ సందర్భంగా స్వీట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా ఒకటి, మనమంతా ఒకటేనని చాటిచెప్పాలి. కుల, మత, వర్గ బేదాలు లేకుండా కలిసికట్టుగా జీవించాలి. నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యులు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో వీటి ప్రాముఖ్యతను తెలిపేందుకు స్వీట్‌ ఫెస్టివల్‌.

హైదరాబాద్‌ ఓ అద్భుతం

హైదరాబాద్‌ ఓ అందమైన నగరం. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరం. అందుకే సంతోషవంతమైన, ఆకర్షణీయమైన, అభివద్ధి నగరానికి విదేశీయులను ఆత్మీయంగా స్వాగతిస్తున్నాం. ఎవరినైనా హైదరాబాద్‌ అక్కున చేర్చుకుంటుంది. మన హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ రుచి గురించి చెప్పాలా, కరాచీ బిస్కట్లు, ఇరానీ చాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేడు ఆన్‌లైన్‌లో కేఎఫ్‌సీ చికెన్‌, మెక్‌డోనాల్డ్స్‌ అంటూ విదేశీ వంటకాలు ఆర్డర్‌ చేసుకుని తింటున్నారు. ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ అంటే కాన్‌స్టంట్‌ డిసీజ్‌. ¬టళ్లు, రెస్టారెంట్స్‌ కొత్త పేర్లతో వంటకాలు చేసి మనల్ని మోసం చేస్తున్నాయి.

¬టల్‌కు వెళితే చికెన్‌ 65 అని ఉంటుంది. చూస్తే విూ వయసు 25 ఉంటుంది. అది విూరు తింటే విూ వయసు తొందరగా 65 అవుతుంది. ఆ వంటకాలు ఎక్కువగా తింటే త్వరలోనే వయసు 85 కూడా అవుతుంది. అందుకే హైదరాబాద్‌, తెలంగాణ, ఆంధ్రా వంటకాలతో పాటు బెంగాళీ, తమిళ్‌ ఇలా ఇండియన్‌ ఫుడ్‌ను ఆస్వాదించండి. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్ని విషయాల్లో సహకరించుకుని ముందుకు సాగాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పండుగలు, ఆటలు, పాటలు, వంటకాలు అన్నింటికీ పూర్వ వైభవం తీసుకురావాలని’ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here