కేంద్ర సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..

0

అనందంలో తెలంగాణ బిజెపి శ్రేణులు

కేంద్రమంత్రిగా సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాేథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకొని రైతు వేషధారణలో కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఎంపీగా ఎన్నికైనా సరే, అత్యంత సీనియర్‌ అయిన కిషన్‌ రెడ్డిని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాే నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో కిషన్‌ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అయితే కేంద్రహోం శాఖా సహాయమంత్రి పదవి కిషన్‌ రెడ్డికి దొరుకుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంబర్‌పేేట్‌ ప్రజల తలలో నాలుకలా….

2003 నుంచి 2005 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2004 లో హిమాయత్‌ నగర్‌ శాసనసభా స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజక వర్గాలు మారడంతో హిమాయత్‌ నగర్‌ అంబర్‌పేేట్‌లోేకి వచ్చింది. 2009,14 లో వరుసగా గెలుపొంది ఎమ్మెల్యేగా గెలుపొంది అంబర్‌పేేట్‌ ప్రజల్లో తలలో నాలుకగా మారారు. అంతేకాకుండా 2010 నుంచి 2014 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

ఒక్కోమెట్టూ ఎక్కుతూ….

బీజేపీతో కిషన్‌ రెడ్డికి విద్యార్థి దశ నుంచే బంధం అల్లుకుపోయింది. 1960 లో రంగారెడ్డి జిల్లాలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. లోక్‌నాేయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని స్వయంగా ఆయనే చెప్పుకుంటారు. 1977 లో రాజకీయ రంగ ప్రవేశం చేసి, 1980 లో బీజేపీ పూర్తికాలపు కార్యకర్తగా మారిపోయారు. ఆ తర్వాత 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గాే, 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు.

1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షునిగా పనిచేశారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా కొనసాగారు. 1992 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా, 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 2002 లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయమే కిషన్‌రేెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. బీజేపీ అగ్రనేతలైన అటల్‌ బిహారీ వాజ్‌పాేయ్‌, ఆడ్వాణీ లాంటి నేతలతో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో పరిచయం కూడా ఈయనకు కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here