కేసీఆరే కింగ్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ముందస్తు వ్యూహం ఫలించింది. తాజా ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ మరోమారు విజయదుందుభి మోగించింది. మరోమారు ప్రజలు గులాబీ నేతనే ఆశీర్వదించారు. ఆయనే తమ నేత అని చాటిచెప్పారు. దీంతో తెలంగాణలో మరోసారి తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.. పలు జిల్లాలో ఏకంగా క్లీన్‌ స్విప్‌ చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, నల్గొండ మినహా అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ తన ప్రభంజనాన్ని సృష్టించింది. మూడు నెలలుగా ¬రెత్తిన తెలంగాణలో చివరకు ప్రజలు కెసిఆర్‌కే పట్టం కట్టారు. ఆయన వెంటే తామంటూ ప్రకటించారు. 7న జరిగిన ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్‌ జరపగా ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఎక్కడా కూటమి ప్రభావం కనిపించలేదు. దీనికితోడు కాంగ్రెస్‌లో తామూ సిఎం అభ్యర్థులమే అని చేటుకున్న వారంతా ఓటమి పాలయ్యారు. దాదాపు 90సీట్లకు పైగా స్థానాల్లో విజయంతో కారు యమస్పీ డ్‌తో దూసుకుని పోతోంది. అయితే టిఆర్‌ఎస్‌లో కూడా మహామ హులు ఓటమి పాలయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, స్పీకర్‌ మధుసూధనాచారి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో పలువురు ప్రముఖులు ఇంటిబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. విస్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన సీఎం కేసీఆర్‌ సరికొత్త వ్యూహంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించారు. వాస్తవానికి ఏప్రిల్‌ లేదా మే లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఎన్ని కల క్షేత్రానికి వెళ్లి అవలీలగా గెలుపొందారు. ఆయన ఆశించిన ఫలితాలు రాబట్టి తెలంగాణలో తన బలాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయితే ముందస్తు ఎన్నికల ప్రకటన నాటికి ఆ పార్టీ సిద్ధం కాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కొందరికి తప్ప మిగిలిన సిట్టింగ్‌ సభ్యులకు స్థానాలను ప్రకటించడంతో ముందుగానే ప్రచారం చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. కాంగ్రెస్‌, తెదేపా, తెలంగాణ జనసమితి, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ సీట్ల కేటాయింపులో పుణ్యకాలం కాస్తా గడిచిపో యింది. ప్రజాకూటమి ప్రచారం కూడా చాలా ఆలస్యంగా ప్రారంభమయింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభలూ ఆలస్యంగా ఏర్పాట య్యాయి. 2014 ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ తర్వాత తెలుగు దేశం మూడోస్థానంలో నిలిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం బలహీనపడింది. ప్రజాకూటమి ప్రచారం ప్రారంభించేసరికి తెరాస అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు తమ నియోజకవర్గాల్లో చుట్టివచ్చారు. కేసీఆర్‌ సైతం ప్రచారం చివరి రోజుల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ విజయం లో ముఖ్యంగా కేసీఆర్‌ అమలు చేసిన అద్భుత పథకాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. వివిధ వర్గాల అవసరాలు తెలుసుకుని పథకాలు రూపొందించడమే కాకుండా, వాటిని సమర్థంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడంలో కేసీఆర్‌ విజయం సాధించారు. అలాగే తక్కువ సంఖ్యలో ఉండే అగ్రవర్ణ ఓటర్లను పార్టీలు పట్టించుకోవు అనే అపవాదు ఉండేది.. కానీ కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగా అల్పసంఖ్యాకులైన అగ్రవర్ణ ఓటర్ల కోసమూ కొన్నింటిని అమల్లోకి తెచ్చి అటువంటి విమర్శలకు తావులేకుం డా చేశారు. దీంతో కేసీఆర్‌ తెలంగాణలో అందరివాడిగా మారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తన ప్రసంగాలతో ప్రజల్లో ఆలోచనలు రేపిన కేసీఆర్‌..

119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ చేసిన ప్రసంగాలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా సాగాయి. నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు, వాటి పనితీరును వివరిస్తూనే.. మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలు, దానివల్ల ప్రజలకు ఏమేరకు మేలు జరిగిందనే దానిపైనా కేసీఆర్‌ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా ప్రసంగాలు చేశారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేస్తున్నామని, ఏ ఒక్క వర్గాన్ని విస్మరించమని స్పష్టం చేశారు. ఒకటి రెండు పథకాల అమలుపై అక్కడక్కడా చిన్నచిన్న అసంతృప్తులున్నా, మరోసారి అధికారం చేపట్టాక వాటిన్నిటినీ సరిదిద్దుతామని ప్రజలకు చక్కగా నచ్చజెప్పారు. పథకాల లబ్ధి దారుల జాబితాలను ముందే తెప్పించి, తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చి కేసీఆర్‌ ఎంతో ముందుచూపు కనబరిచారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. దీంతో ప్రజలు కేసీఆర్‌ ప్రసంగాలతో సంతృప్తి చెంది అద్భుత మెజార్టీని తెరాసకు కట్టబెట్టారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్టాల్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీన్నిదృష్టిలో పెట్టుకొనే ముందస్తుగానే అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని సీఎం కేసీఆర్‌ భావించారు. కార్యక్షేత్రంలోకి దిగారు. విజయపథాన పార్టీని పయనించారు.అవిభక్త రాష్ట్రంగా ఉన్న సమయంలో లక్షలాది కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. వసుధైక కుటుంబం అన్న భావనను వారి మదిలో నాటడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస భారీ విజయాన్ని సాధించింది. గ్రేటర్‌ పరిధిలో మజ్లిస్‌ ప్రాబల్యం ఉంది. వీరితో తెరాసకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి గతమెన్నడూ లేని రీతిలో మెరుగ్గా ఉంది. పోలీసింగ్‌ మంచి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఇతర రాష్ట్రాల ఓటర్లు సైతం తెరాసకు అండగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here