రచ్చ మొదలెట్టిన కిమ్‌

0

  • క్షిపణుల్ని పరీక్షించిన నార్త్‌ కొరియా

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తూర్పు సముద్రంలో ఒకేసారి అనేక లాంచర్లతో క్షిపణుల్ని పరీక్షించి? మిలిటరీ స్ట్రైక్‌ డ్రిల్‌ చేయించారు నార్త్‌ కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌. శాంతి మంత్రం వల్లెవేస్తూనే..క్షిపణి పరీక్షలు ఎందుకు జరుపుతున్నారో కిమ్‌కే తెలియాలి. ఎక్కువ దూరాలకు దూసుకెళ్లే లాంగ్‌ రేంజ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్లు, టాక్టికల్‌ గైడెడ్‌ వెపన్స్‌ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ డ్రిల్‌ జరిపించినట్లు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిసింది. న్యూస్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఫొటోలను బట్టీ అవి షార్ట్‌ రేంజ్‌, భూమి నుంచీ భూమిపైకి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులుగా తెలుస్తోంది. స్థానికంగా వాటిని ఇస్కాండర్‌ అని పిలుస్తారు. మిస్సైళ్లను పరీక్షించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు వ్యతిరేకం. ముఖ్యంగా సుదూర తీరాలకు వెళ్లే క్షిపణుల్ని పరీక్షించడం మరింత పెద్ద నేరం. అలాంటి పరీక్షలు తమకు ముప్పు కలిగిస్తాయని అమెరికా వాదిస్తోంది. ఈ కొత్త బాలిస్టిక్‌ క్షిపణులు? 500 కిలోవిూటర్ల దూరం వెళ్లగలవని సమాచారం. కొరియా ద్వీపం మొత్తానికీ (దక్షిణ కొరియా సహా) వెళ్లగలవు. సౌత్‌ కొరియాలో అమెరికా ఏర్పాటు చేసిన అధునాతన యాంటీ-మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టంను అవి నాశనం చెయ్యగలవని తెలుస్తోంది. దక్షిణ కొరియా కూడా తాజాగా ఇలాంటి క్షిపణుల్ని పరీక్షించింది. అవి 70 నుంచీ 240 కిలోవిూటర్లు వెళ్లగలవు. ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం? క్షిపణుల శక్తి సామర్ధ్యాలు మరింత పెరగాలనీ, తమ దేశంవైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి ఉండకూడదని సైనిక అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేసుకునే అంశంపై ఫిబ్రవరిలో అమెరికాతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తాజాగా జరిపిన పరీక్షలతో మళ్లీ ఉత్తరకొరియాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here