ఊపిరి తీస్తున్న రక్తం

0

మనిషిని రక్తం బతికిస్తోంది. కానీ ఇప్పుడు అదే రక్తం మనుషుల ప్రాణాలను తోడేస్తోంది. మనిషి జీవించాలంటే.. రక్త ప్రసరణ తప్పనిసరి.. ప్రతి కణానికి చేరి, ప్రాణవాయువు అందించి ఊపిరిని అందిస్తుంది. అదే రక్తం ఊపిరి తీస్తే…? శరీరాన్ని దహిస్తే…? ఏం చేస్తాం..? ఈ ప్రాణాంతకమైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగానూ ఈ వ్యాధి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రక్తంలోని ఎర్ర రక్తకణాలు క్రమం తప్పడం, హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో సికిల్‌ సెల్‌, తలసేమియా రోగాలు వచ్చి పడుతున్నాయి. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇదీ విషయం:

మనిషి ప్రాణాలను కాపాడే రక్తమే ఊపిరితీసేస్తోంది. సికిల్‌ సెల్‌, తలసేమియా రెండు రక్త క్షీణత వ్యాధులు. ఇవి జన్యుపరంగా సంక్రమించే వ్యాధులని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తంలో గుండ్రంగా ఆరోగ్యంగా ఉండే ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారుతాయి. ఇక తలసేమియాతో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో మార్పులు ఏర్పడతాయి. రక్తం జీవితకాలం 120 రోజులు కాగా కొత్తగా రక్తంలో కణాలు, హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికాక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. సాధారణంగా హిమోగ్లోబిన్‌ పిల్లల్లో 13-15 (గ్రామ్‌ ఫర్‌ పర్సంటేజీ) ఉండాలి. కానీ ఇది 5-3 వరకు పడిపోయి ఎనీమియాకు దారి తీస్తుంది. దాంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వ్యాధి లక్షణాలు:

I సికిల్సెల్‌, తలసేమియా వ్యాధి బారినపడ్డ పిల్లల్లో ఎదుగుదల లోపం(ఎత్తు, బరువు) ఉంటుంది.

I శ్వాస సంబంధిత వ్యాధులతో అవస్థ పడుతుంటారు.

I కాలేయం పెరగడం

I స్పీన్‌ సమస్యలు

I తరచూ జ్వరం రావడం

I చేతులు, పాదాలకు వాపురావడం

I ఎముకలు సన్నబడటం వంటి లక్షణాలు ఉంటాయి

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, హుజూరాబాద్‌ ప్రాంతాల్లో సికిల్సెల్‌, తలసేమియా బాధితులు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఉట్నూరు, మందమర్రి, మంచిర్యాలతో పాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, మహాబూబ్‌ నగర్‌ జిల్లాల్లోనూ వ్యాధి బాధితులు ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రపతిచే ప్రారంభం:

రక్త క్షీణత వ్యాధులైన ‘సికిల్సెల్‌-తలసేమియా’ వ్యాధి గురైన వారికి చికిత్స చేసేందుకు, లోతుగా పరిశోధన చేసేందుకు కరీంనగర్‌ మండలం నగునూరు గ్రామంలోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్లెన్స్‌ ఇన్‌ సికిల్సెల్‌, తలసేమియా అండ్‌ అదర్‌ జెనెటిక్‌ బ్లడ్‌ డిసార్డర్స్‌ ఇన్‌ రూరల్‌’ను

ఇటీవలే రాష్ట్రపతి రామ్నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్లెన్సితో అధునాతన వైద్యం

ప్రతిమ ఆసుపత్రిలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్లెన్సీ ఫర్‌ సికిల్సెల్‌ తలసేమియా అండ్‌ అదర్‌ జెనెటిక్‌ బ్లడ్‌ డిసీజెస్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 మంది వైద్యులతో చిన్నపిల్లల వైద్యులు, హెమటాలజీ, ట్రాన్స్ఫ్యూజన్‌ మెడిసిన్‌ అందుబాటులోకి తెచ్చారు. వ్యాధితో బాధపడే వారికి తరచూ ఎర్ర రక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. దీంతో వీరి శరీరంలో పేరుకుపోయే ఇనుమును తొలగించడానికి ఐరన్‌ చిలేషన్‌ డ్రగ్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫెరటిన్‌ లెవల్‌, హార్మోన్‌ లెవల్‌, రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు, గుండె పనితీరును తెలుసుకునే పరీక్షలు చేస్తారు. గుండె, కాలేయంలో ఐరన్‌ లోడ్‌ ఎంతుందో తెలుసుకునే పరీక్షలన్నీ ఒకేచోట చేసే వీలుంటుందని సికిల్‌ సెల్‌, తలసేమియా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ అమిత్కుమార్‌ తెలిపారు.

నివారణ

I వ్యాధి బారిన పడిన వారికి తరచూ ఎర్ర రక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది.

I బోన్మ్యారో, స్టెమ్సెల్‌ థెరపీ చికిత్స ద్వారా జీవిత కాలాన్ని పెంచే వీలుంది.

I రక్తహీనతతో బాధపడే యువతీ యువకులు పెళ్లికి ముందే పరీక్షలు నిర్వహించుకోవాలి. రక్తహీనత ఉంటే అది ఏరకమైనదో పరీక్షల ద్వారా నిర్ధారించి అవగాహన కల్పించడం ద్వారా సమస్యను కొంత వరకు నియంత్రించడానికి వీలుంటుంది.

I 16 నుంచి 20 వారాల గర్భిణులకు ఉమ్మనీరు పరీక్ష ద్వారా పుట్టబోయే పిల్లలు సికిల్సెల్‌, తలసేమియా వాహకులా లేదా సాధారణ శిశువా అనేది నిర్ధారించే వీలుందని వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here