వాళ్లను చంపేయాలి..

0
  • మోడీకి పదేళ్ల బాలిక లేఖ
  • పుల్వామా దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలి
  • సూరత్‌ బాలిక రాసిన లేఖ వైరల్‌.

గుజరాత్‌ : పుల్వామా దాడిపై దేశం మొత్తం రగిలిపోతున్నది. పాకిస్థాన్‌పై ప్రతీకారం కోసం ఆరాటపడుతున్నది. అందులో ఓ పదేళ్ల బాలిక కూడా ఉంది. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే ఈ పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు కాల్చి చంపాలని, పాకిస్థాన్‌పైనా ప్రతీకారం తీర్చుకోవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ పాప ఆ లేఖలో కోరడం విశేషం. ఇప్పుడీ లేఖ సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో ¬మ్‌వర్క్‌ చేస్తూ ఉన్న మనాలీ.. టీవీలో వార్త చూసి చాలా బాధపడింది. ప్రధానమంత్రితో మాట్లాడొచ్చా అని తన తల్లిని అడిగితే.. మాట్లాడటం కుదరదు కానీ లేఖ రాయమని సూచించింది. దీంతో హిందీలో ఆ పాప ఓ లేఖ రాసి ప్రధానికి పంపించింది.

గీతలోనూ అదే చెప్పారు..

దుర్మార్గులను చంపడం తప్పేవిూ కాదని భవద్గీతలోనూ చెప్పినట్లు మనాలి గుర్తుచేసింది. ‘మోడీ గారు.. మీపై నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపేయాలి. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని గీతలో కూడా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here