Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

న్యాయదేవత కళ్ళకు ఖాకీ గంతలు

బతికిన మనిషిని చంపేశారు

  • హత్యను ఆత్మహత్యగా మార్చి
  • చచ్చినోడిని జైల్లో వేశారు
  • తప్పుడు నివేదికతో తంటాలు
  • హైకోర్టు ఆగ్రహం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణరాష్ట్ర పోలీసు చరిత్రలో ఓ దుర్థినం. న్యాయాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ…ఖాకీ కరకు కాఠిన్యం చివరికి న్యాయదేవత కళ్ళకు తమదైన పంథాలో గంతలు గట్టిగా బిగించి కట్టాలని చూశారు. మైనర్‌ బాలిక హత్యను ఆత్మహత్యగా చూపారు. బతికున్న మనిషిని రికార్డుల ప్రకారం ‘ఔరంగాబాద్‌’లో చంపేశారు. చచ్చిన మనిషిని అదే కేసులో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌, చంచల్‌ గుడా జైలుకు పంపారు. అయితే అసలు విషయాన్ని గ్రహించిన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చింది. పోలీసుల పరిశోధన ఇలా దిగజారడం ఆ శాఖ పనితీరు చెప్పకనే చెపుతుంది.

అసలు కథ:

ఏప్రిల్‌24, 2019న 14 ఏళ్ళ బాలికను హైదరాబాద్‌ లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్‌ జావెద్‌ ఖాన్‌, రహీల్‌ ఖాన్‌ లు కిడ్నాప్‌ చేశారు. ఈ మేరకు బహదూర్‌ పురా పోలీస్టేషన్‌ లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్‌ 92/2019 రిజిస్టర్‌ అయింది.

ఔరంగాబాద్‌ లో శవంగా:

హైదరాబాద్‌ లో కిడ్నాప్‌ కు గురైన బాలికను వదిలి వేస్తామని జావెద్‌ ఖాన్‌, రయీల్‌ ఖాన్‌ లు సెల్‌ నెంబర్లు 6301407486, 9010114324 నుంచి బాలిక తల్లిదండ్రులను బెదిరించారు. తల్లిదండ్రులు ఈ విషయాలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర, ఔరంగాబాద్‌, రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ బాలిక మ తదేహం లభించింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌ మార్టం అనంతరం తల్లిదండ్రులకు మ తదేహం అప్పగించారు. అయితే పోస్ట్‌ మార్టం నివేదికలో బాలిక తలపై తీవ్రమైన గాయం, ఇతర భాగాలపై గాయాలున్నట్లు ఉంది.

సహజమరణంగా నివేదిక:

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌ లో బాలిక మ తి చెందిన వైనం తెలుసుకున్న బహదూర్‌ పురా పోలీసులు క్రైం నెంబర్‌ 92/2019లో హైకోర్టుకు సమర్పించిన నివేదికలో … బాలిక, ఆటో డ్రైవర్‌ జావెద్‌ ఖాన్‌ కూడా ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు తెలిపారు. అనంతరం ఇదే పోలీసులు చనిపోయాడని చెప్పిన జావెద్‌ ఖాన్‌ ను అరెస్ట్‌ చేసి చంచల్‌ గుడా జైలుకు పంపినట్లు చెప్పారు. రెండు పరస్పర ప్రక తి విరుద్ద విషయాలు పోలీసులు ఏకం చేసి చూపారు. ఎంతైనా మన ‘బంగారు ఖాకీలు’ బహు తెలివైనవారే.!

హైకోర్టు తీవ్ర ఆగ్రహం:

ఒకే కేసులో దర్యాప్తు పూర్తిస్థాయిలో చేయకపోవడమే కాకుండా అబద్దాలను చెప్పడం పట్ల బాలిక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. హత్యకు గురైన బాలికతో పాటు జావెద్‌ ఖాన్‌ మరణిస్తే అతని మ తదేహం ఎక్కడ..? జావెద్‌ మరణిస్తే ప్రస్తుతం చంచల్‌ గుడాలో ఉన్న జావెద్‌ ఎవరు..? హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేస్తుంటే… ఆత్మహత్య కట్టుకథ ఎక్కడ పుట్టిందంటూ హైకోర్టు కన్నెర్ర చేసింది. చార్మినార్‌ ఏసిపి విచారణ చేసి పూర్తి స్థాయి నివేదిక నాలుగు వారాలలో సమర్పించాలని శుక్రవారం ఆదేశించింది.

త్రిశంకు స్వర్గంలో…?

బాలిక కిడ్నాప్‌, అనంతరం హత్య. ఈకేసును సహజమరణంగా చూపిన పోలీసుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. ఒకసారి చనిపోయాడని చెప్పిన జావెద్‌ ను మళ్ళీ బతికించి జైలుకు పంపారు. ఈ పరిశోధనలో భాగం పంచుకున్న ఇద్దరు పోలీసులు సస్పెన్షన్‌ కోసం తయారైనట్లు తెలిసింది.

కడ వరకూ పోరాడతాం -కరుణాకర్‌ రెడ్డి

ఈ కేసులో బాధితులు తరఫునళకడవరకు పోరాడతాని, నిజాలను నిగ్గు తేలుస్తామని హైకోర్టులో ఈ కేసు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కరుణాకర్‌ రెడ్డి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కు చెప్పారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close