Featuredరాజకీయ వార్తలు

రెండు నెలలైనా గజ్వెల్‌ను పట్టించుకోని కెసిఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మంత్రి హరీష్‌ రావు గజ్వెల్‌లోనే మకాం వేశారు. కెసిఆర్‌ తన నియోజకవర్గంలో రెండు నెలలయినా ఇంతవరకు ప్రచారంలోకి దిగలేదు. ఆ భారమంతా హరీష్‌ తన భుజస్కంధాలపై వేసుకుని ఊరూరా తిరుగుతు న్నారు. రోజూ ఎక్కడో చోట విూటింగ్‌లు, ఆత్మీయ సమావేశాలు, కుల సంఘాల విూటింగ్‌లు సాగుతు న్నాయి. కెసిఆర్‌ను లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన ప్రచారంలో ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇదిచూసి కొన్ని గ్రామాల్లో చాలామందికి అభ్యర్థి కెసిఆర్‌ అని తెలియదు. హరీ ష్‌రావే తమ అభ్యర్థి కాబోలని అనుకుంటున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి నిత్యం దండకం వల్లె వేస్తున్నారు. నాలుగేళ్ల తెలంగాణ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని నేతలంతా ఇప్పుడు గొప్పగా చెప్పు కుంటున్నా ప్రజల్లో మాత్రం ఎక్కడా పెద్దగా స్పందనా రావడం లేదు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కెసిఆర్‌ కిట్టు ఇలా ఒకటేమిటి 400 పథకాలు అంటూ చెబుతున్నారు. ఇంతలో కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి బాంబు లాంటి ప్రకటన చేశారు. కెసిఆర్‌ను ఓడించేందుకు మరీస్‌ రావు పథకం వేశారని, దానిని అమలు చేయాలని తనను పురమాయించారని అన్నారు. నిజానికి ఇదో రాజకీయ ఎత్తుగడ కాక మరోటి కాదు. అయితే దీనిపైన స్థానికంగా ప్రజల్లో విపరీతమైన చర్చ సాగుతోంది.. గజ్వెల్‌లో నిజానికి ఎన్నడూ లేని అభివృద్ది పథకాలు జరిగాయి. అయినా ప్రజల్లో అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆనాటి ఎమ్మెల్యే సైదయ్య ఇంటికొచ్చి మాట్లాడే వాడు…ఫలానా ఆయన ఇలా ఉండేవారు అని చెవులు కొరక్కోవడం ఎక్కువయ్యింది. ఉద్యమంలో కెసిఆర్‌ ఇచ్చిన హావిూలపై ప్రజల్లో తీవ్ర నిరాశ ఉంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో కెసిఆర్‌ చెప్పిన మాటలను ఎడిట్‌ చేసి మరీ విడుదల చేస్తున్నారు. వాటి ఆధారంగా సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ను పిట్టల దొర అంటే సహించని ప్రజలే ఇప్పుడు స్వయంగా కెసిఆర్‌ పిట్టల దొర అంటున్నారు. కెసిఆర్‌ లాగా ఉత్తుత్తి మాటలు మాట్లాడలేంరా.. అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ప్రచారంలో పథకాల పేర్లు చెప్పి ఓట్లు రాల్చుకోవాలన్న వ్యూహంలో టిఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. అనేక పథకాలు ప్రవేశ పెట్టినా ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు… తమ నాయకుడు అనుకున్న వారంతా ఇప్పుడు కెసిఆర్‌ తమవాడు కాదన్న భావనలో ఉన్నారు. గజ్వెల్‌ చుట్టూ హరీష్‌ రావు తిరుగుతుంటే… మిగతా తెలంగాణలో కెటిఆర్‌ తిరుగుతున్నారు. ఇప్పడుఉ ట్రైలర్‌ మాత్రమే చూశారని..ముందున్నది అసలు సినిమా అని ఎంపి కవిత సెటైర్లు వేస్తున్నారు. ఆమె కేవలం నిజామాబాద్‌కే పరిమితం అయ్యారు. మహాకూటమి అభ్యర్థుల పేర్లు బయటకు వస్తే తప్ప కవిత ప్రచారం ఊపందుకునేలా లేదు. ఇకపోతే నీళ్లు,నిధులు, నియామకాలకు సంబంధించి ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఎక్కడికి వెల్లినా ఈ ఆందోళన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే విూకోసమే మేము..మళ్లీ ఆశర్వదించండి అంటూ ప్రచారంలోదూసుకుని వస్తున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపుతున్నారు. ఎక్కడికి

వెళ్లినా ఏం చేశావని నిలదీస్తున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో

పరిమితం కాలేదు. దీనికితోడు టిక్కెట్‌ దక్కని వారు పార్టీ మారుతున్నారు. నిజానికి మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. 105 మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఎప్పుడో విడుదలయ్యింది. దాదాపు రెండునెలలుగా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌,టిడిపి, బిజెపిలను తిడుతూ ప్రచారం చేస్తున్నారు. వారి పేరెత్తకుండా ఎక్కడా ప్రచారం చేయడం లేదు. ఎందుకిలా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే ప్రజలకు నాలుగేళ్లలో అద్భుతాలు జరిగివుంటే ఇంతగా చెమటోడాల్సి రావడం ఎందుకన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు దక్కలేదు. ఇంటింటికి నల్లా రాలేదు. ఉద్యోగాలు ఎండమావి అన్నది తేలిపోయింది. అభ్యర్థులు కూడా అభివృద్ది అంటూ దండకం చదివినా కళ్ల ముందు కనిపించే పనులు లేవు. కెసిఆర్‌ పేరు చెప్పి ప్రచారంలో పాల్గొంటున్నారే తప్ప ఫలానా పనిని విూ కోసం చేశామని ఖచ్చింతగా చెప్పలేక పోతున్నారు. గ్రామాలపై అభ్యర్థులకు పట్టు కనిపించడం లేదు. విస్తృత ప్రచారంతో ముందుకు వెళుతున్నా భరోసా మాత్రం కనిపించడం లేదు.

ప్రచార¬రు చూస్తుంటే ఇది ఉద్యమ పార్టీయేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే సిఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్‌ లాంటి ప్రాంతంలో కూడా మంత్రి హరీష్‌ రావు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. నిజానికి గజ్వెల్‌లో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కళ్లముందు కనిపిస్తున్నాయి. అయినా ఇక్కడా చెమటోడ్చాల్సి వస్తోంది. మిషన్‌ కాకతీయ లాంటి పథకాలు భారీ దోపిడీ పథకాలుగా కళ్లకు కనిపించాయి. నాలుగేళ్లుగా అధికరాంలో ఉన్నా కాంగ్రెస్‌,టిడిపిలు అభివృద్దికి అడ్డం పడుతున్నా యన్న సొల్లు కబుర్లే వినిపిస్తున్నాయి. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి సింహంలాంటి సీఎం కావాల్నా.. ఢిల్లీకి గులాం గిరీచేసే సీల్డుకవర్‌ సీఎం కావాలా అంటూ మరోవైపు కెటిఆర్‌ సవాళ్లు విసరుతున్నారు. వివిధ పార్టీల నుంచి క్షేత్రస్తాయిలో కొందరిని చేర్చుకోవడం ద్వారా అంతా తమకే అనుకూలమన్న లెవల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అధికరా పార్టీ పత్రికలు, విూడియా అదేపనిగా ప్రచారం చేస్తూ వాపునుబలుపుగా చేస్తున్నాయి. కెసిఆర్‌ సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదన్న విషయంపై విపరీత ప్రచారం చేస్తు న్నారు. చరిత్రలో ఎందరో కొత్త ఒరవడిని సృష్టించారు. ఆ అవకాశం కెసిఆర్‌కు కూడా వచ్చింది. కానీ కెసిఆర్‌ దానిని సక్రమంగా వినియో గించుకోలేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో ఎదురీత తప్పడం లేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close