అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

0

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పూజారులు

కాంచీపురం

తమిళనాడులోని కాంచీపురంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్‌ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన కేసీఆర్‌ తొలుత రేణిగుంట చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గంలో కంచి చేరుకున్నారు. నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా స్వాగతం పలికారు. అనంతరం కాంచీపురం చేరుకోగానే అక్కడ ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం అత్తివరదరాజ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవితతో పాటు ఆర్కే రోజా, తదితరులు ఉన్నారు.

రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు సహకరిస్తాం: సీఎం కేసీఆర్‌

రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు మా వంతు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌, నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. అనంతరం నగరి నుంచి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌కు బయల్దేరే ముందు రోజా నివాసంలో కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉంది. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. వృథాగా పోయే నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయి. 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సమన్వయంతో పనిచేస్తాం. రాయలసీమకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు యువ నాయకుడు, పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రులం సమన్వయంతో పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని సీఎం పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here