అంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

రైతులను మోసం చేసిన కెసిఆర్

రుణ మాఫీ కోసం నిధులు కేటాయించని ప్రభుత్వం

స్వయం సహకార సంఘాలకు మొండిచేయి

బిజెపి జాతీయ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రెడ్డి

వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులను నిలువునా మోసం చేశారని బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రెడ్డి అన్నారు రైతు సమస్యలపై కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర అ మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు విషయమై విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి రాష్ట్ర కిసాన్మోర్చా కార్యదర్శి దేవ శ్రీనివాస్ బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదు రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు లక్ష లోపు రుణాలను మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చ లేదన్నారు ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తుందని ఉద్దేశంతో రైతులు బ్యాంకులు అప్పులు చెల్లించలేదని ఫలితంగా వారి రుణాలపై చక్రవడ్డి పడి వడ్డీ భారం పెరిగిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు లక్షలోపు రుణంపై తక్కువగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి నిధులు విడుదల చేయని కారణంగా వడ్డీ పెరిగిపోయిందని అన్నారు ప్రస్తుత బడ్జెట్లో రుణ మాఫీ కోసం 600 కోట్లు ఇచ్చిందని కానీ వాస్తవంగా 20 వేల కోట్లు అవసరం ఉంటుందని అన్నారు తూతూమంత్రంగా కొందరు రైతులకు రుణమాఫీ చేసిన మిగతా వారికి నిధుల కొరత ఏర్పడుతుందని అన్నారు రైతు బంధు పథకం కేవలం 30 శాతం మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని అన్నారు ఇంకా 70 శాతం మంది రైతులు రైతు బంధు నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అన్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు వడ్డీ రుణాల కింద 30 వేల కోట్లు అవసరం ఉండగా కేవలం 10 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు ప్రాజెక్టుల పేర్ల తో కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం 170000 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రైతుల సాగుకు సరిపోను నీరు అందని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి అన్నారు ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు దాదాపు 60 వేల కోట్లు ప్రాజెక్టుల పేరుతో అవినీతికి ఆజ్యం పోశారు అని అన్నారు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం రెండు కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టారని అన్నారు రైతుకు ఆరువేల రూపాయలు పంట పెట్టుబడి పథకం కింద అందజేస్తున్న మన్నారు 60 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు రైతు సమస్యలపై ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం దృష్టికి రైతు సమస్యలను తీసుకువెళతామని పరిష్కరించే వరకు వాటిపై పోరాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివరాజ్ పటేల్ శంకర్ మాధవరెడ్డి పాండు వెంకటయ్య రాజు మల్లేష్ శేఖర్ యాదవ్ బసవలింగం నరేందర్ రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఇ అమరేందర్ రెడ్డి తో పాటు వివిధ మండలాలకు చెందిన బిజెపి నాయకులు పాల్గొన్నారుAttachments area

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close