Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి

బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ

  • మూడులక్షలకోట్లు అప్పులున్నాయన్న భట్టి
  • భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌
  • అసత్యాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం
  • అప్పులు తెచ్చాం.. ఎలా తీర్చాలో మాకు తెలుసు
  • ప్రాజెక్టులపై ఇరుపక్షాల మధ్య వాగ్విద్దం

హైదరాబాద్‌

తెలంగాణ బ్జడెట్‌పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క బ్జడెట్‌ కేటాయింపులు, అప్పులపై లేవనెత్తిన అంశాలు చర్చకు దారితీశాయి. తొలుత మాట్లాడిన భట్టి.. రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలు వాస్తవికానికి దూరంగా ఉన్నాయని ఆరోపించారు. ఆరు నెలలకోసం ఓటాన్‌ అంకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రాష్టాన్రిదేనని ఎద్దేవా చేశారు. ఫలితంగా ప్రస్తుత బడ్జెట్‌కు కోత పడిందని విమర్శించారు. రాష్టాన్న్రి అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే రూ.3లక్షల కోట్ల అప్పు ఉందని తెరాస ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ అప్పులు తీసుకొస్తామని చెబుతోందని మండిపడ్డారు. దీంతో సీఎం కేసీఆర్‌ కల్పించుకొని భట్టి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాలని, పదే పదే అబద్దాలు వ్లలెవేయొద్దని కోరారు. రాష్టాన్రికి రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడంపై కేసీఆర్‌ స్పందించారు. ఈ రాష్టాన్రికి మూడు లక్షల కోట్ల రూపాయాల అప్పు ఉందా? దీన్ని రుజువు చేస్తారా? విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే మంచిదని సూచించారు. లేని దాన్ని ఉన్నట్టు.. 2 లక్షల కోట్ల అప్పును మూడ లక్షల కోట్ల అప్పుగా చూపిస్తే ఊరుకుంటామా? రుజువు చేస్తారా? ఇలాంటి అవాస్తవాలు మాట్లాడొద్దని కేసీఆర్‌ అన్నారు. దీంతో భట్టి మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమను బెదిరించాలని చూడొద్దని, ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని తొలగించి ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న ఎంఐఎంను ప్రతిపక్షంలో కూర్చొని ఏకపక్షంగా సభ నడిపిద్దామంటే ఎలా కుదురుతుందని భట్టి ప్రశ్నించారు. దీంతో స్పందించిన కేసీఆర్‌ సభలో వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదని, వాస్తవాలు చెప్పకుండా అబద్దాలు చెబుతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. అలా మేము ఊరుకోమని, సత్యమైన వివరాలతో మాట్లాడితే బాగుంటుందని, ఏమైనా అనుమానాలుంటే తాము నివృత్తి చేస్తామని అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్‌ బట్టి విక్రమార్కను నిలదీశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి బ్జడెట్‌ కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. ఏదో సాకు చూపి పద్దు తగ్గించారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇచ్చిన హావిూలను విస్మరించిందని మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఏవని నిలదీశారు. నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పి వంచించారని ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని మభ్యపెట్టారని .. విమర్శించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉందని .. కానీ మాంద్యం పేరు చెప్పి బ్జడెట్‌ కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బ్జడెట్‌ కేటాయింపులు .. ఖర్చు మన రాష్ట్రంలో తేడా ఉందన్నారు. 34 శాతం డిఫరెన్స్‌ ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సామాజిక మార్పు కోసం .. ఆత్మగౌరవంతో బతికేందుకు అని … కానీ దానిని వమ్ము చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చే నాటికి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఉందని, దానిపై దృష్టిసారించలేదని, దృష్టిసారించి ఉంటే ఇప్పటి వరకు నీళ్లు పారించేవారమన్నారు. దీంతో స్పందించి కేసీఆర్‌ ప్రాణహిత చేవెళ్లకు అసలు అగ్రిమెంట్లే లేవన్నారు. ఢిల్లీ, ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా అగ్రిమెంట్లు చేసుకోకుండా గాలికొదిలేశారని అన్నారఉ. అనంతరం భట్టి మాట్లాడుతూ.. గోదావరి పై ప్రాణహి – చేవెళ్ల, దేవాదుల, ఇందిరా సాగర్‌ – రాజీవ్‌ సాగర్‌ ఈ మూడు ప్రాజెక్టులకు ఆనాటి ప్రభుత్వాలు కొంత నిధులు కూడా ఖర్చు చేయటం జరిగిందని భట్టి అన్నారు. దుమ్ముగూడెం – రాజీవ్‌ సాగర్‌కు 1,686కోట్లు, ఖర్చు చేసింది 820కోట్లు అన్నారు. ఇంకా ఖర్చు చేయాల్సింది 853కోట్లు మాత్రమేనన్నారు. దీంతో కేసీఆర్‌ కల్పించుకొని ప్రాజెక్టుల పై అసత్యాలు మాట్లాడవద్దని సూచించారు. ఈ రాష్ట్రంలో విూకు అభివృద్ధి కనబడడం లేదా? ఒక్క ప్రాజెక్టు కూడా విూకు కనబడడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైమ్‌లో కడితే విూకు కనిపిస్తలేదా? భక్తరామదాసు ప్రాజెక్టును ఒక్క ఏడాదిలో పూర్తి చేశామన్నారు. ఇది కనబడుత లేదా? ఈ ప్రాజెక్టు ఉన్నది విూ జిల్లాలోనే కదా? లక్ష్మీ బ్యారేజీని ఇప్పటి వరకు 20 లక్షల మంది చూశారన్నారు. కళ్లున్న కబోదుల్లాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని, తప్పుగా, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటామని అన్నారు. సభలో అందరం సమానమేనని, ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, కాంగ్రెస్‌ది ఐదేళ్లుగా ఇదే ధోరణి. ప్రజలు విూకు కర్రు కాల్చి వాత పెట్టినా విూ తీరు మారలేదు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులను సంప్రదించే బ్జడెట్‌ ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. పద్దు ఎందుకు తగ్గిందో కూడా వివరించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల్లో కోత పెడితే ఏం చేయమంటారు అని నిలదీశారు.

కొత్త ప్రాజెక్టల నుంచి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు – భట్టి

ఖమ్మంలో దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌, దుమ్ముగూడెం ఇందిరాసాగర్‌ లేవని కేసీఆర్‌ అనడం సిగ్గుచేటన్నారు. సభలో అనుమతిస్తే సభలో అప్పట్లో ప్రాజెక్టు ఖర్చులను, అగ్రిమెట్లను కేసీఆర్‌కు సూపిస్తానని అన్నారు. జిల్లాలో రెండు ప్రాజెక్టులు మొదలు పెట్టింది వాస్తవమేనని, నిధులు ఖర్చు చేసింది నిజమన్నారు. ఇప్పటి వరకు 882కోట్లు కావాల్సింది కేవలం 950కోట్లు వీటిని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిధులు ఇచ్చి ఉంటే ఆ ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు నీళ్లుపారేవని అన్నారు. అదేవిధంగా ఇందిరాసాగర్‌ రుద్రంకోట వద్ద మునిగిపోయిందని కేసీఆర్‌ చెప్పాడని, ఆ రోజుల్లో పోలవరం కట్టేటప్పుడు మునిగిపోతే ఒక దగ్గర, పోలవరం కట్టకపోతే మరో దగ్గర అని హెడ్‌వర్క్‌ పనులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దానికి 1,204కోట్లు ఖర్చు చేశారని, కావాల్సింది 560 కోట్లు మాత్రమే నన్నారు. మొత్తం ఈ రెండు ప్రాజెక్టులకు రూ.1,421కోట్లు ఖర్చు చేసి ఉంటే ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలకు నీరొచ్చేదని భట్టి అన్నారు. దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం సుమారు రూ.7వేల కోట్లు ఖర్చు చేశారని, కావాల్సింది రెండువేల కోట్లు అన్నారు. గోదావరిపై మూడు ప్రాజెక్టుల కోసం ప్రత్యేక తెలంగాణ అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రూ.31,421 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఇప్పటికే 36లక్షల40వేల ఎకరాలకు నీళ్లు పారేవని భట్టి అన్నారు. కృష్ణానదిపై నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, కోయిల్‌ సాగర్‌, బీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఏఎంఆర్‌ ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించనమేనని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ. 3 నుంచి 3,500 కోట్లు ఖర్చుచేసి ఉంటే , 10లక్షల50వేల ఎకరాలకు అందనంగా నీళ్లు పారేవని భట్టి తెలిపారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, ఇప్పటి వరకు ఐదేళ్లవుతున్నా నీరు రాలేదని భట్టి విమర్శించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close