Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ఒవైసీ బ్రదర్స్‌ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మ..

తెలంగాణ విమోచన ఉద్యమంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్‌

  • టీఆర్‌ఎస్‌పై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
  • యాదాద్రిలో కేసీఆర్‌ ఆయన చరిత్రను చెక్కుకుంటున్నారు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

న్యూఢిల్లీ

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి ప్రజలు తిరగబడ్డారని, నేడు టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సాయుధపోరాట యోధుల చిత్ర ప్రదర్శనను దిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీలు బండి సంజయ్‌, అరవింద్‌, ఢిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, జాతీయ బీసీ కమిషన్‌ మెంబర్‌ ఆచారి, పెద్దిరెడ్డి, గద్దె రామ్మోహన్‌నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా బైరాన్‌పల్లి గ్రామంలో రజాకారులను దాడులను చూసిన పెద్ద మనుస్సులు 20 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ తన సాహసోపేత నిర్ణయంతో 562 సంస్థలను భారత్‌లో విలీనం చేశారని అన్నారు. అయితే కేవలం 3 రాజ్యాలు మాత్రం భారత్‌లో కలవబోమని మొండికేశాయని, అందులో నిజాం సంస్థానం కూడా ఉందని చెప్పారు. ఆ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ తెలంగాణ ప్రజలు తిరగబడ్డారని అన్నారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు బీభత్సం సృష్టించారని గుర్తు చేశారు. వారి దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఏకమైన తిరగబడ్డారని అన్నారు. నేడు సీఎం కేసీఆర్‌ పాలనకు విసిగిపోతున్న ప్రజలు అదే తీరులో తిరగబడేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను సాగిస్తున్న కేసీఆర్‌ గుణపాఠం తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ కేసీఆర్‌ కేంద్ర పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాథ్యమవుతుందని భావిస్తున్నారని కిషన్‌రెడ్డిపేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎందరో పోరాట యోధులు ఉన్నారని, వారి వీరగాథలను దిల్లీలో ప్రదర్శించామన్నారు. నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందని గుర్తు చేశారు. నిజాం దారుణాలకు బలైన కుటుంబాలను పరామర్శిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పోరాటాల చరిత్రను మరుగునపడేలా కల్వకుంట్ల చరిత్ర రాస్తున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చరిత్రను చెక్కుకుంటున్నారని, కల్వకుంట్ల కుటుంబ చరిత్రనే తెలంగాణ భావితరాలకు చెబుతున్నారని ఆరోపించారు. మజ్లీస్‌ ప్రోద్భలంతో తెలంగాణ పోరాటాల చరిత్రను కాలగర్భంలో కలిపేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. విమోచనదినాన్ని అధికారికంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లక్ష్మణ్‌ తెలిపారు. కేసీఆర్‌ దిగివచ్చి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close