Featuredరాజకీయ వార్తలు

రాజయోగమే లక్ష్యంగా కేసీఆర్‌ రాజశ్యామల యాగం !

సిద్దిపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌): టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు రాజశ్యామల హోమం నిర్వహి స్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ హో మం పూర్తి కానుంది. హోమం పూర్తి కాగానే ఖమ్మం జిల్లా నుండి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు ఈ యాగం సాగుతోంది. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు పూర్ణాహూతితో యాగం ముగియనుంది. పూర్ణాహుతి పూర్తి కాగానే కేసీఆర్‌ ఖమ్మంలో జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారానికి బయలు దేరి వెళ్లనున్నారు. రాజ శ్యామల యాగం ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైంది. మరోసారి తెలం గాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్‌ కుటుంబసభ్యులు కూడ ఈ హోమంలో పాల్గొంటున్నారు. గతంలో కేసీఆర్‌ ఇదే ఫామ్‌ హౌజ్‌ వేదికగా కేసీఆర్‌ మహాఛండీయాగాన్ని నిర్వహించారు. విశాఖ స్వరూపానందస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాగం సాగుతోంది. ఈ యాగం నిర్వహించేందుకు 120 మంది రుత్వికులు వచ్చారు.రాజమండ్రి, కేరళ, విశాఖ నుండి రుత్వికులు వచ్చారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొంటు న్నారు సోమవారం మధ్యాహ్ననికి హోమం పూర్తికానుంది. మూఢనమ్మకాలను విశ్వసించే ముఖ్యమంత్రులలో మొదటి స్థానంలో ఉండే కేసీఆర్‌ ఇప్పుడు గెలుపు కోసం యాగం చేస్తు న్నారు. పూర్తిగా చేతులెత్తేయాల్సిన పరిస్థితి రావడంతో చివరి ప్రయత్నంగా ఫామ్‌ హౌస్‌లో యాగం చేస్తున్నారు. ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆది సోమ వారాల్లో ఆయన చండీయాగం కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మొత్తం 120 మంది రుత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖ స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజుల పాటు రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 40మంది రుత్వికులు ప్రారంభించారు. కేసీఆర్‌ ఆదేశం మేరకు ఆయన సన్నిహితులు ఇటీవల స్వరూపానంద జన్మదినోత్సవానికి వెళ్లి ఫామ్‌ హౌస్‌లో రాజ శ్యామల హోమం జరపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే సమయంలో శ ంగేరి ఆస్థాన పండితులు ఫణి శశాంక శర్మ, గోపికష్ణ శర్మ ఆధ్వర్యంలో 72 మంది ఋత్విక్కులు మహారుద్ర సహిత చండీ యాగం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలు నిర్వహించే రుత్వికులు శనివారం సాయంత్రానికి ఫామ్‌ హౌస్‌కి చేరుకున్నారు. కేసీఆర్‌ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌ హౌస్‌కు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ ప్రజలకు మంచి చేసి ఉంటే ఈ యాగాలతో పని ఏముంటుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్‌కు ప్రజలకు మంచి చేయడం అంటే తన కుటుంబానికి మంచి చేయడమే అనుకుంటారని, అందుకే యాగాలు తప్పడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫామ్‌ హౌస్‌ చుట్టూ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవర్ని లోపలికి అనుమతించడం లేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close