Featuredరాజకీయ వార్తలు

ఫామ్‌హౌజ్‌ నుండి భారీ స్కెచ్‌..

– కాంగ్రెస్‌ ఆసమ్మతుల వైపు కెసిఆర్‌ చూపు

– పోటీకి ప్రోత్సహించేలా ప్రణాళిక

– అధికారంలోకి వస్తే గుర్తింపంటూ సంకేతాలు

– ఓటమి భయంతోనే ప్రచ్ఛన్న వ్యూహాలు

– భయపడమంటున్న కూటమి నేతలు

వారు వారు కోట్టుకచావాలి… వారి కొట్లాటలో విజయం మనల్ని వరించాలి.. రాజకీయం అంటేనే చదరంగం.. రాజకీయం అంటేనే అవకాశం కోసం ఎదురుచూసే ఒక ఆట.. ఎప్పుడు ఎవరూ ఏటూ మారతారో.. ఎవ్వరూ ఏటూ అలోచిస్తారో అర్థంకాని వింత క్రీడ రాజకీయం.. అందుకే బద్ద శత్రువును కూడా అవసరం కోసం మిత్రున్ని చేసుకుంటారు. అవసరం తీరాక మళ్లీ అణగద్రొక్కెలా పావులు కదుపుతారు.. శత్రువుని శత్రువు మిత్రుడు అవుతాడు. మనతో మనవాళ్లే అనుకున్న వాళ్లు శత్రువులు అవుతారు.. అధికారం కావాలంటే ఎన్నో జిమ్మిక్కులు.. ఎన్నో మార్పులు..ఎన్ని ఎత్తులు, ఎత్తులకు పై ఎత్తులు.. ఏమైనా కాని అధికారం రావాలి.. పదవులు కావాలి.. ఐదు సంవత్సరాలు మళ్లీ రాష్ట్రాన్ని పరిపాలించాలి.. ఇదే ఇప్పుడు తెలంగాణలో తెరాస, కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నది.. గులాబి అధినేత ఫామ్‌హౌజ్‌లో ఉంటూ మరొకొత్త ప్రణాళికలకు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారం రావాలంటే ప్రచారం ఒక్కటే సరిపోదని, ప్రత్యర్థుల్లోనే జగడం పుట్టిస్తే… ప్రతిపక్షంలో సీట్లు అభ్యర్థులను తెరచాటుగా ఉండి ప్రోత్సాహిస్తే ఏలాఉంటుందని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. అందుకు వ్యూహాలకు, ప్రతి వ్యూహాలు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నారు తెరాస అధినేత కెసిఆర్‌… తన కంటిని తానే పొడుచుకున్నట్లు, శత్రువు కంటిని శత్రువులతోనే పొడిపించాలని అందుకు కాంగ్రెస్‌ ఆసమ్మతినేతలతో చర్చలు సాగించేలా సంకేతాలు పంపిస్తున్నారు.. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్దపీట వేస్తామని, గౌరవమైన స్థాయిలోనే గుర్తిస్తామని బరిలో మాత్రం ఉండాలని తెరాస పార్టీ శ్రేణులు టికెట్టు రాదు అని తెలిసినా అసమ్మతి నేతలతో రాయబారం నడుపుతున్నట్టు సమాచారం.. రాజకీయం ఏలా మారుతుందో, ఎవరూ ఏలా ఆలోచిస్తారో, ఏ గాలి ఏటు వీస్తుందో తెలియదు.. కెసిఆర్‌ పన్నుతున్న వ్యూహాలకు విజయం ఎంత వరకు దరిచేరుతుందో చూడాల్సిందే…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కెసిఆర్‌ అంటేనే భారీగా డైలాగులు.. మాటలతో మాయ చేస్తూ ప్రత్యర్థులను తట్టుకోకుండా దిగ్భందం చేయగల నాయకుడని పేరుంది. ఆయన బహిరంగసభలకు వెళుతే పదునైన మాటలతో ప్రజలను రెచ్చగొడుతే, ప్రతిపక్షాలను దునుమాడుతాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగైదు బహిరంగసభలు పెట్టిన కెసిఆర్‌ మళ్లీ సైలెంట్‌ ఐపోయాడు. తన ఫాంహౌస్‌లో ఉంటూ వార్‌ రూంలో రాజకీయ వ్యూహాలు రచించడం కెసిఆర్‌కు బాగా అలవాటే.. కెసిఆర్‌ మౌనంగా ఉన్నాడంటేనే ప్రతిపక్షాలకు యుద్థం ప్రకటిస్తున్నాడని అర్థం.. కెసిఆర్‌ మౌనం వెనుక వ్యూహత్మక కథ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే.. మహాకూటమి ఏర్పడ్డాక కెసిఆర్‌లో గెలుపు ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తున్నాయి. మహకూటమిని కాదని ఏలాగైనా విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మహాకూటమి ఇప్పటివరకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనే లేదు. మరో రెండు రోజులు లేదా దసరా తరవాతనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెపుతున్నారు. సీట్లకోసం ఆశ పెట్టుకున్న ఆశావాహులు చాలామంది ఉన్నారు. టిక్కెట్లు రాని వారు తిరుగబాట ఎగరేసేలా ఉండడంతో వారిని మచ్చిక చేసుకోని ఆసమ్మతి నాయకులుగా బరిలో ఉంచేలా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్‌ నేతలు సీట్లు పొత్తుల్లో టిడిపి, సిపిఐ, టిజెఎస్‌కు పోనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్లు రాని వారంతా అసమ్మతిగళం వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వారందరిలో కొంతమంది పోటికి కూడా సై అంటున్నారంట.మొండి పట్టుతో కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పిన వినని వారు చాలామంది ఉండటంతో అటు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ తలనొప్పికి వారు జాండ్‌బామ్‌ పెట్టుకొని రాసుకుంటారు కాని అసమ్మతులు మాత్రం వెనక్కి తగ్గోద్దంటూ, వారితో పోటీ చేయించాలని కెసిఆర్‌ తమ పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలిసింది..

కాంగ్రెస్‌ ఆసమ్మతీలతో తెరాస చర్చలు..

కాంగ్రెస్‌లోని అసమ్మతినాయకులను కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకోవడం లేదు. ఎవరెవరైతే పోటి చేస్తానని పట్టువిడవకుండా ఉన్నారో వారిని చేరదీయాలని తెరాస ఆలోచన. వారిని పార్టీలోకి తీసుకుంటే టిఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు అసమ్మతులు చేరడం వలన పడదు అనే ఆలోచన ఉన్నారు. అందుకే వారితోనే వారి పార్టీలోనే పోటి చేపిస్తే కాంగ్రెస్‌ సీట్లు పొందిన వారిని ఓడించేలా కోవర్టు ఆపరేషన్‌కు కెసిఆర్‌ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.. మహకూటమి పొత్తుల్లో సీట్టు దక్కని కాంగ్రెస్‌ నేతలతో వ్యూహాత్మక చర్చలు జరపాలని కెసిఆర్‌ జిల్లాల, మంత్రులకు ఆదేశించినట్లు తెలిసింది.. అసంతృప్తులకు టిఆర్‌ఎస్‌ గెలిచాక పదవులు ఇద్దామని, లేదా ఎమ్మెల్సీ నామినేటెడ్‌ ఆశచూపాలని, నమ్మకం కలుగకపోతే భారీ బహుమానం కూడా ముట్టజెప్పి కాంగ్రెస్‌ కోవర్టులుగా తీర్చిదిద్దాలని కెసిఆర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. మహాకూటమి ఓటమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్‌ కోవర్టులు పనిచేయాలని కెసిఆర్‌ దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్‌ గెలవగానే ఈ కాంగ్రెస్‌ కోవర్టులను ప్రభుత్వంలో చేర్చుకోని పదవులతో పాటు, ఇతర మహుమానాలు ఇవ్వాలని గులాబీ అధినేత ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తాజాగా నిర్ణయించిన నలభై సీట్లలో టికెట్లు రాని నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. వారిని గుర్తించి కోవర్టులుగా మార్చేందుకు టిఆర్‌ఎస్‌ రంగం సిద్దం చేసిందంట. కాంగ్రెస్‌ కోవర్టుల ప్లాన్‌తో వారి నెత్తిన వారి చెయ్యిపెట్టి వారిని ఓడించాలన్నదే కెసిఆర్‌ వ్యూహాం. కాని కెసిఆర్‌ రహస్యంగా అమలు చేస్తున్న వ్యూహం బయటికి పడిందని, టిఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే లోబరుచుకునేలా తమ పార్టీ అభ్యర్థులతో చర్చలు జరిపి రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. కెసిఆర్‌ ఎన్ని వ్యూహాలు పన్నినా ఈ సారి తెరాసకు ఓటమి మాత్రం తప్పదంటున్నారు. తెరాస అధినేత ఓటమి భయంతోనే కొత్త కొత్త ప్రణాళికలు, ప్లాన్‌లు వేస్తున్నారని, వారి గెలుపుపై వారికే నమ్మకం లేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close