కారు ఓనర్‌ ఎవరు.. కేసీఆరా.. కేటీఆరా ?!

0

గులాబీ పార్టీకి ఎవరూ అధినాయకులు… ఆ పదం ఎవరిని అడిగినా నవ్వుతారు.. ఎందుకంటే కెసిఆరే గులాబీ పార్టీ సామ్రాజ్యానికి బాస్‌.. అధికారంలోకి వచ్చాక కాబోయే రెండో ముఖ్యమంత్రి కూడా కెసిఆరేనని ఎవ్వరిని అడిగినాచెపుతారు. ఈ విషయం తెలంగాణలో ఉన్న చిన్నా పెద్దా అందరికి తెలిసిందే, దానికి అంత పెద్ద చర్చ కూడా అనవసరమే.. మరీ కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్‌.. ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక సిఎంగా కెసిఆరే ప్రమాణస్వీకారం చేస్తాడని కెటిఆర్‌ పలు సభల్లో, పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో ఎందుకు చెప్పుతున్నాడో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అస్సలే అర్థం కావడం లేదంట.. ముందుగా ఏదో అనుకున్నారు… అదీ ఇంకేదో జరుగబోయే సరికి ఇలా మాట్లాడుతున్నారని పార్టీ సీనియర్‌ నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం….

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న కూడా ఒక ప్రశ్నేనా అనే అనుమానం అందరికి వస్తుంది. కాని ఆ అనుమానం సందేహాంగా మారుతుంది. ఇప్పుడీ విషయం ప్రజలకంటే ఎక్కువగా టిఆర్‌ఎస్‌ వర్గాలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కెసిఆరే ముఖ్యమంత్రి అంటూ ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అలా పదే పదే ప్రశ్నిస్తున్నారనేది ఆసక్తికరంగా మారిపోయింది. టిఆర్‌ఎస్‌ గెలిస్తే కెసిఆర్‌ ముఖ్యమంత్రి అన్నది పక్కాగా అందరికి తెలిసిన విషయమే ఐనా ముందస్తు ఎన్నికలకు పోయిందే తన కుమారుడికి పట్టాభిషేకం చేయడానికి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తొమ్మిదినెలలు అధికారం చేతిలో ఉన్నా దానిని పూర్తిగా వినియోగించకుండా, హడావుడిగా ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నకు సరియైన సమాధానం ఇప్పటికి దొరకడం లేదు. ఒక్కొసారి, ఒక్కొరకంగా సమాధానం చెబుతున్న కెసిఆర్‌ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిందలు వేస్తుందని, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తుందని వాటికి జవాబు చెప్పేందుకే తాము ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు చెపుతున్నారు. కాని ఆయన చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు ఏలాంటి పోలిక లేనట్టుగానే ఉంది. తెలంగాణ కోసం కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసి, ఎంతోమంది బలిదానాలు చేసి కొట్లాడి, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం. ఏ ఆశలు, కలల కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశలు నేరవేర్చకుండానే ముందస్తుకు వెళ్లడం కరెక్టు కాదనే, అధికారదాహం కోసం, కుమారుడిని సిఎం చెయ్యడం కోసమో, వెళ్లారనే ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలు ముందుస్తు ఎందుకో మాకు అర్థమవుతుంది. ఇప్పుడీ ఎన్నికల్లో గెలిచి ఏడాది తర్వాత మళ్లీ ఇదే రకంగా సవాళ్లు విసిరో, కుట్రలు చేశారనో అప్పుడు కూడా ఇదే రీతిలో ముందస్తుకు వెళతారా అని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాఅవుతోంది. దాని భారం ఎవరూ భరించాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ముందస్తుకు అసలు కారణం వేరే పెట్టుకొని ప్రతిపక్షాలు అన్నాయనో, ఇంకేదనో ప్రభుత్వాన్ని రద్దుచేయడం కరెక్ట్‌ కాదనేది అసలు వాదన.

తండ్రి సిఎం… కొడుకే మంత్రి..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు మంత్రిగానే ఉంటారనే ప్రచారం చేయాల్సిందిగా సాక్షాత్తూ కెసిఆర్‌ కుమారుడికి చెప్పినట్లుసమాచారం. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను తీసుకురావాలనుకుంటున్న మూడో ప్రంట్‌ మొదటికే మోసం చేయడంతో ఏటూ పాలుపోక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాను ఒకటి తలిస్తే, తెలంగాణ ప్రజలు మరొకటి తలచినట్లుగా అయ్యిందని కెసిఆర్‌ సన్నిహితుల దగ్గర అన్నట్లు చెబుతున్నారు. తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్తే తన కుమారుడు ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం తెలంగాణలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ప్రతిపక్షాలైతే తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. కెటిఆర్‌ వ్యవహరశైలి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన దుందుడుగు స్వభావంతో పార్టీలో కూడా ఇబ్బందులు తప్పవని కెసిఆర్‌కు ఇంటెలిజెన్సీ నివేదికలు సైతం రావడంతో కెసిఆర్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలను ప్రజలకోసం కాదు అధికారం బదిలీ కోసమే అనే ప్రచారంతో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికే కెటిఆర్‌ మాటల్లో తేడా

రావడానికి కారణంగా చెబుతున్నారు.

ఎన్నిలు దగ్గర పడుతున్న వేళ తన కుమారుడు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కారణంగా ఎన్నికల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచించిన కెసిఆర్‌ మళ్లీ తెరపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తే నేనే సిఎం అన్నట్లు ప్రచారం నడిపిస్తున్నారు. తన కుమారుడు కెటిఆర్‌ ప్రచారం పోయిన దగ్గరకూడాతెరాస అధికారంలోకి వస్తే కెసిఆరే సిఎం అని ప్రచారం చేయమన్నట్లు సూచించినట్లు తెలుస్తుంది. పార్టీ శ్రేణులకు,జిల్లాలో ప్రచారం నిర్వహించే నేతలకు అందరికి తెరాసకు కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్‌నని, కెటిఆర్‌ కాదనే ప్రచారం పెద్ద ఎత్తున చెయ్యాలని అధిష్టానం ఆదేశించినట్లు చెబుతున్నారు. అలాగే తాను జాతీయ రాజకీయాలను ఇక్కడినుంచే శాసిస్తానని, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా తనకు రాష్ట్రం, తెలంగాణ ప్రజలే ముఖ్యమనేఅభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే కూడా అభ్యర్థులకు సూచించినట్లు సమాచారం. అప్పటి నుండే కెటిఆర్‌ బహిరంగసభలలో, పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ తన తండ్రే మళ్లీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నారు. ప్రజల్లో నాటుకు పోయిన అనుమానాలను, అభిప్రాయాలను తుడిచి వేయాలని, ఉద్యమం చేసిందీ తానే కనుక వారికి తనపైనే ఎక్కువ నమ్మకమని కూడా చంద్రశేఖర్‌రావు పార్టీ సినీయర్‌ నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. లేకపోతే టిఆర్‌ఎస్‌ గెలిస్తే కెసిఆర్‌ సిఎం అని కెటిఆర్‌ చెప్పుతునే తెలుస్తుందా అని అనుమానాలు ప్రజల్లో రానియ్యద్దని అందుకే ప్రచారాన్ని మార్చాలని కెసిఆర్‌ చెప్పినట్లు సమాచారం. అందుకే మళ్లీ తెరాస అధికారంలోకి వస్తే తండ్రే సిఎం, కొడుకు మంత్రే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుంది టిఆర్‌ఎస్‌ పార్టీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here