Featuredరాజకీయ వార్తలు

కోనాయిపల్లి వెంకటేశ్వరుని ఆశీస్సులతో..కెసిఆర్‌ నామినేషన్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అనుకున్న ముహూర్తం, సమయంలో గజ్వెల్‌ టిఆఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిఎం కెసిఆర్‌ నామినేషన్‌ వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా కొందరు అనుచరులతో కలసి వెలల్‌ఇ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ ప్తరాలు అందచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గజ్వేల్‌ తెరాస అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామిని హరీశ్‌రావుతో కలిసి కేసీఆర్‌ దర్శించుకున్నారు. నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి గజ్వేల్‌ చేరుకున్నారు. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కేసీఆర్‌ తెలంగాణ శాసనసభను రద్దు చేసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా డిసెంబరు 7న ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.11వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 100కు పైగా స్థానాలు వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మంత్రి హరీశ్‌ రావు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. కోనాయపల్లి నుంచి కెసిఆర్‌ గజ్వెల్‌కు, హరీష్‌ రావు సిద్దిపేటలకు వెళ్లారు. తొలుత హరీశ్‌ రావు ఇంటి నుంచి బయలుదేరి ఈద్గా చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. హరీశ్‌ రావు వెంట పలువురు టీఆర్‌ఎస్‌ నేతలున్నారు. మరోవైపు హుస్నాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇకపోతే పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశికళ యాదవరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పటాన్‌ చెరు నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో సీనియర్‌ నేతగా తమకు ప్రజలతో సత్సబంధాలు ఉన్నాయన్నారు. మహాకూటమిలో భాగంగా పటాన్‌చెరు టిక్కెట్‌ ఏ పార్టీకి కేటాయించినా వారి విజయం కోసం కృషి చేసేవారిమని ఆమె అన్నారు. మంచి రోజు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసినట్లు శశికళ యాదవరెడ్డి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. మెదక్‌ జిల్లాలో నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంజీవరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఆందోల్‌ బీజేపీ అభ్యర్థిగా బాబుమోహన్‌, జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాణిక్‌ రావు, పటాన్‌చెరు కాంగ్రెస్‌ అభ్యర్థి శశికళాయాదవరెడ్డి నామినేషన్‌ వేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రేఖానాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి నామినేషన్‌ వేశారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గుజ్జల రామకృష్ణారెడ్డి, మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శంకర్‌నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మేడ్చల్‌ బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డి, సూర్యాపేట కాంగ్రెస్‌ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే ఇల్లందులో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా లకావత్‌ దేవీలాల్‌ నామినేషన్‌ వేశారు. నల్గొండ జిల్లా మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మునుగోడు ఇండిపెండెంట్‌గా పాల్వాయి శ్రవణ్‌ నామినేషన్‌ వేయగా, మహబూబ్‌నగర్‌ టీడీపీ అభ్యర్థిగా ఎర్ర శేఖర్‌ నామినేషన్‌ వేశారు. మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్‌ వేశారు. శేరిలింగంపల్లి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా మొవ్వ సత్యనారాయణ, హుస్నాబాద్‌లో సీపీఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డి తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్‌ అభ్యర్థిగా మక్కన్‌ సింగ్‌ నామినేషన్‌ వేయగా, జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి బీజేపీ అభ్యర్థిగా చందు పట్ల కీర్తిరెడ్డి నామినేషన్‌ వేశారు. ములుగు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి చందులాల్‌, కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బిగాల గణెళిష్‌ గుప్తా ,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమాజ్‌వాది అభ్యర్థి గుండు ప్రదీప్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆరూరి రమేష్‌ నామినేషన్లు వేశారు. వీరంతా తాము నిర్ణయించుకున్న ముహూర్తాల మేరకు నామినేషన్లు వేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close