Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కెసిఆర్ కపట రాజకీయం మానుకోవాలి

దక్కన్ పీఠభూమికి గొంతు తడిపే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ మార్చడం దుర్మార్గం
ప్రజా స్వేచ్ఛను ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కెసిఆర్
– జలసాధన సమితి భరోసా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
– రైతులు విద్యావంతులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయ వంతం చేయండి
– మాజీ మంత్రి టిపిసిసి ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్.
వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్.

ప్రత్యేక తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం కపట రాజకీయాలకు తెరలే పారని ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను మార్చుకోవాలని టి పి సి సి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతంలోని ఎత్తయిన భూములకు సాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఈ నిర్మించేందుకు గోదావరి నది నుండి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దోబిపేట్ శివారు వరకు ప్రాణహిత ప్రాజెక్టు కాలువను పూర్తి చేశారని, వికారాబాద్ మండలం వీరంపల్లి వరకు ఓపెన్ కెనాల్ నిర్మాణానికి కొన్ని పనులు పూర్తి చేయడం తో పాటు వీరంపల్లి నుండి పూడూరు మండలం దామగుండం వరకు టన్నెల్ నిర్మాణం పనులు మధ్యలో నిలిచిపోయాయి ఈ పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దక్కన్ పీఠభూమి నీ సస్యశ్యామలం చేసే ప్రాణహిత చేతి వేళ్లను డిజైన్ మార్చి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారు అని ఆరోపించారు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కల్వకుంట్ల కుటుంబం కాకి గోల చేసిందని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో జరిపిన చర్చల్లో గోదావరి నీటిని రాయలసీమకు రప్పించి రతనాల సీమగా మారుస్తామని ప్రకటించడం అభినందనీయమే, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతాల పక్షపాత ధోరణి వదలి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ లతోపాటు నల్లగొండ, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు గోదావరి నీటితో తడిపి సస్యశ్యామలం చేసిన తర్వాత రాయలసీమకు తరలిస్తే బాగుంటుందని సూచించారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోవడానికి ప్రధాన కారణం నీళ్లు, నియామకాలు,  నిధుల  వె చింపు అన్నారు. స్వరాష్ట్రంలో కూడా అవే సమస్యలు పట్టి పీడిస్తున్నాయా అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే చిన్న నీటి, మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు. కెసిఆర్ పాలనలో మాటల గారడీ తప్ప మెరుగైన అభివృద్ధి కనబడుట లేదు అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని, ప్రాణహిత కు ప్రత్యామ్నాయ ప్రాజెక్టుగా నిర్మించేందుకు సర్వేలు పూర్తిచేశామని ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చి జూరాల ప్రాజెక్టు నుండి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా నీటి తరలిస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఇది సాధ్యమైన పని కాదని రైతులపై పెను భారం పడే ఈ ప్రయత్నాన్ని తమ పార్టీ ఖండిస్తుంది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు సమాన పాలన అందించాల్సి ఉంటుంది, కెసిఆర్ ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని, ప్రాజెక్టులు, రోడ్లు, పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఉత్తర తెలంగాణకే తరలించి, ఉమ్మడి పాలకుల బాటలోనే పాలన సాగిస్తున్నారని నిందించారు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను, పౌర హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జల సాధన సమితి భరోసా పాదయాత్రకు వికారం చుట్టామని ఈ యాత్రలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జల సాధన సమితి భరోసా యాత్ర ఆగస్టు 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.27వ తేదీ ఉదయం ఏడు గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దోబిపేట్ టన్నెల్ నుండి ప్రారంభమై శంకర్పల్లి మీదుగా చేవెళ్ల కు సాయంత్రం వరకు చేరుకుంటుంది అన్నారు. 28వ తేదీ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రానికి మన్నెగూడ జె కే ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందన్నారు.29వ తేదీ మన్నెగూడ నుండి రాకంచెర్ల మీదుగా పరిగి పట్టణానికి చేరుకుంటుంది అన్నారు.30వ తేదీ పరిగి నుండి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతానికి చేరుకుంటుంది అన్నారు. ఈ పాదయాత్రలో జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని రైతులకు రుణమాఫీ ఇప్పటికీ అందలేదని, కొత్త రుణాలు పొందలేదని అన్నారు. రైతుబంధు ఈ ప్రాంత రైతులకు ఎవరికి సంపూర్ణంగా అందలేదన్నారు. రోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ఆత్మహత్యలు వందల సంఖ్యలో జరిగాయని దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరమన్నారు.  ఈ యాత్రలో దారిపొడవునా ఉన్న గ్రామాల రైతులు, ప్రజలను, ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఓదారుస్తు ముందుకు సాగుతామని ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జలసాధన సమితి భరోసా పాదయాత్ర  సన్నాహక సమావేశాలు నిర్వహించి విధి విధానాలు, నిర్వహణ బాధ్యతలను పలువురికి అప్పగించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు ఏ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కిషన్నాయక్, ఏ బ్లాక్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, న్యాయవాదులు, యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గ్రామాల బాధ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close