Featuredస్టేట్ న్యూస్

కేసీఆర్‌.. కేటీఆర్‌ ఒక్క సారి ఆలోచించండ

  • ఇల్లందు పట్టణంలో మేము చేసిన నష్టం ఏమిటి
  • మాకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు
  • పాత్రికేయుల సమావేశంలో తెరాస నేత మడత

భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు (ఆదాబ్‌ హైదరాబాద్‌): మున్సిపాలిటి అభివృద్ధే ధ్యేయంగా వివిధ పార్టీలను వదిలి, రాజ కీయ భవిష్యత్తును వదిలి తెరాస పార్టీలో చేరడమే తప్ప అని తెరాస సీనియర్‌ నేత, మున్సిపల్‌ మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు మడత వెంకట్‌ గౌడ్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రి కేయుల సమావేశం లో మడత నిప్పులు చెరిగారు. తెరాస బలం కోసం 42 మంది సభ్యులతో పార్టీలో చేరామని గుర్తు చేశారు. పార్టీకి, అభివృ ద్ధికి వ్యతిరేకం కాదని, గెలిచిన ప్రతి ఒక్కరు తెరాస పార్టీలో అభివృద్ధికి ముందుకు వస్తున్నారన్నారు. ఈ తరుణంలో మీతో కలిసి పని చేయాలని ఆలోచించామని, రెబల్‌గా పోటీలో దిగడంసరైంది కాదనే భావన ఉందన్నారు. ఎమ్మెల్యే మరో మారు సవినంగా ఆలోచించి 8 లేదా 10 మంది మా అనుచరు లకు టికెట్లు ఇవ్వాలని కోరారు. కమిటీ వేసే క్రమంలో తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఒక కమిటీ నుండి ఒక కమిటీల వారి పేర్లు తీసుకొచ్చి రకరకాల మోసాలు చేశారన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేటీఆర్‌ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగిం దని ప్రశ్నించారు. మా నాయ త్వా నికి, రాజకీయ భవిష్యత్తును బొందలో పెట్టెందుకే వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తీరు మాకు నష్టపరిచారనిర వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రూ. వెయ్యి, రూ. రెండు వేలు ఇచ్చి కొనుక్కు ంటా రో ఏమో మాకు తెలియదు. కానీ మేము మాత్రం ప్రజల మనస్సులను కొన్నామని ధీమ వ్యక్తం చేశా రు. ప్రజలు మాకు ఆశీర్వధీస్తారని తెలిపారు. చైర్మన్‌ సీటు కోసం మద్దతిస్తే మాది స్వార్ధపూరిత మవు తుందని, పార్టీకి నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు న్యాయం చేసేలా ఎమ్మెల్యే మరో మారు ఆలోచి ంచా ల్సిందిగా విన్నవించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మడత రమ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close