కేసీఆర్ కీలక నిర్ణయం : ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఫ్రీగా రీ వెరిఫికేషన్

0

ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసుకోవాలని సూచించారు. ఈమేరకు ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధర్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి అప్పగించారు. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడాలన్నారు. 

భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యూహం ఖరారు చేయాలని ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదన్నారు సీఎం కేసీఆర్. 3.28 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నా పత్రాలను ఇంటర్ బోర్డు రీ వెరిఫికేషన్ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here