Featuredజాతీయ వార్తలు

జాతీయపార్టీల ఉచ్చులో కేసీఆర్‌

జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీలను నమ్మే పరిస్థితులు లేవు. ఇటీవల జరిగిన సంఘటనలను దృష్ట్యా ప్రత్యేకంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చంద్రశేఖర రావును ఈ జాతీయ పార్టీలు నమ్మే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో తమిళనాడులో జరిగిన అనుభవాల దృష్ట్యా అక్కడ జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే మరో అమ్మగా శశికళ తయారవుతోన్న తరుణంలో పాతకేసులు తిరగదోడి… శ్రీకృష్ణ జన్మస్థానాకి పంపింది ఓ జాతీయ పార్టీ. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే బెంగళూరులో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీలు మరోసారి తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి ఎదుర్కోటానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

తెలంగాణ ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్‌ కాంగ్రెస్‌ అధిష్టానంతో ఢిల్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ కుటుంబ సమేతంగా ఫోటోలు దిగి సమావేశం తర్వాత ఆయన విలీనం విషయాన్ని మరిచినట్లు కేసీఆర్‌ భావించారు. అనంతర పరిణామాల దృష్ట్యా తన సొంత కుంపటి అయిన తెరాసను అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టారు. నాలుగు సంవత్సరాలలో కేసీఆర్‌ తన కుటుంబ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అనేకమందిని అనేక విధాలుగా వేధించిన సంఘటనలు ఈ జాతీయ పార్టీలు నిశితంగా పరిశీలించాయి. భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను పదేపదే మననం చేసుకుంటుంది. అంతేకాకుండా మధ్యంతర ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులను ఊహించని విధంగా ఉక్కిరిబిక్కిరి చేసిన కేసీఆర్ను కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు నమ్మటం లేదని ఇటీవల జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కెసిఆర్‌ విషయంలో… మజ్లీస్‌ తో సన్నిహితంగా ఉండటం కూడా ఆ పార్టీకి భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయని భావిస్తుంది. ఇక స్థానిక నాయకత్వం కూడా తెలంగాణలో బలహీనంగా ఉండటానికి కూడా కేసీఆర్‌ వైఖరేనని

భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తుంది.

తెరాస వాగ్దానాల వల్ల గతంలో సుమారు 1,80 లక్షలకోట్ల రుణాన్ని ఎలా భర్తీ చేయాలనే విషయంలో కెసిఆర్‌ అంతర్గతంగా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

ఫెడరల్‌.. పెడదోవ..:

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ చేస్తున్న ప్రతి విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు మరో రూపంలో విశ్లేషణ చేస్తున్నాయి.కాంగ్రెస్‌ పార్టీ ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

బాబు.. బాకు..:

కేసీఆర్‌ విషయంలో ఏం చేయాలన్నా చంద్రబాబు తనవంతు ఇతోధిక సహకారం అందించటానికి సంసిద్ధంగా ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కేసీఆర్‌ తన ఇష్టారాజ్యంగా ఆడుకున్నారు. దీంతో పాటు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు ఓ సామాజిక వర్గం భావిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కేసీఆర్‌ విషయంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. దాంతో ఆ పార్టీ వ్యూహకర్తలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వారు కెసిఆర్‌ కు పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా కేసీఆర్‌ ‘గిప్ట్‌’ విషయంలో ఓ సుధీర్ఘ ఎత్తుగడలు వేస్తునట్లు తెలిసింది.

బీసీలకు అండగా ఉంటా: చంద్రబాబబు

బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జయ¬ బీసీ సభకు తెదేపా శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జనాభాలో బీసీలు 50 శాతం ఉన్నారని, వారిని ఆదరించి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ”ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాం. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖతో పాటు 25 శాతం బడ్జెట్‌ పెట్టాం. గతంలో ఎప్పుడైనా ఇంత మంది బీసీ మంత్రులు ఉన్నారా? అన్ని వ్యవస్థల్లో బీసీలకు ప్రాధాన్యమిచ్చాం. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. తెలుగుదేశం పార్టీని వెనుకబడిన వర్గాలు నమ్ముకున్నాయి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బీసీల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ” అని చంద్రబాబు అన్నారు.

వైఎస్‌ హయాంలో బీసీలకు అన్యాయం..:

”కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. తెదేపా బలపడుతుందని వెనుకబడిన వర్గాలను వైఎస్‌ అణగదొక్కారు. 31 కులాలను బీసీల్లోకి చేర్చి రిజర్వేషన్లు పెంచకుండా వైఎస్‌ అన్యాయం చేశారు. 11 బీసీ ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారు. బీసీ నాయకులను హత్య చేశారు. 2 వేల మంది నేత కార్మికులు, 1600 మంది గీత, 30 మంది సర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీసీ మంత్రులు జైలు పాలయ్యారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేసిన పార్టీ తెరాస. బీసీ రిజర్వేషన్ల రద్దుకు జగన్‌ వత్తాసు పలికారు. బీసీలను దెబ్బతీసేందుకు వైకాపా, భాజపా కుట్రపన్నాయి” అని విమర్శించారు.

బీసీలకు వరాలు..

”విదేశీ విద్య కింద వెనుకబడిన వర్గాలకు రూ.15 లక్షలు ఇస్తాం. బీసీలకు 100 నుంచి 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తాం. నేతన్నలకు రూ.111కోట్లు రుణమాఫీ చేశాం. ఎంబీసీలను గుర్తించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. ఎంబీసీలకు కేటాయించిన రూ.100 కోట్లలో రూ.90 కోట్లు ఖర్చు పెట్టాం. విద్యార్థులకు రూ.2,900 కోట్లు ఉపకార వేతనాలు ఇచ్చాం. ఆదరణ పథకం కింద రూ.950 కోట్లతో 4లక్షల మందికి పనిముట్లు ఇచ్చాం. బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. విూకు తోడుగా నేనుంటా.. నాకు చేయూతనిచ్చే బాధ్యత విూరు తీసుకోవాలి. సంఘటిత శక్తిగా తయారైతే బీసీలకు ఎదురే ఉండదు. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకే. తెదేపా తరఫున ప్రతి గ్రామంలో జయ¬ బీసీ గర్జన ఉద్ధృతం చేయాలి. జయ¬ బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌, కొల్లు రవీంద్ర పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీసీ శ్రేణులతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది.

ఃూచీ

వైఎస్‌ జగన్‌తో దగ్గుబాటి భేటీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో పరుచూరు మాజీ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. తన కుమారుడు హితేష్తో కలిసి జగన్‌ నివాసానికి చేరుకున్న దగ్గుబాటికి వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీలో చేరుతారనే ఉహాగానాల నేపథ్యంలో జగన్తో దగ్గుబాటి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ప్రకాశం జిల్లాలో వైసీపీ టికెట్‌ ఇచ్చే అంశంపై జగన్తో వెంకటేశ్వరరావు చర్చించినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు సతీమణి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close