Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

కేసీఆర్‌ కు అఫిడవిట్‌ ఉచ్చు

కేటీఆర్‌ కూడా..

  • తెలంగాణలో 34 మంది..?
  • ఆంధ్రాలో ఐదుగురు
  • చత్తీస్‌ఘడ్‌ తీర్పుతో భాజపా పావులు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాజకీయ వ్యూహాలు వేగంగా మారతాయి. చదరంగ పావులు అవసరాలకు

అనుగుణంగా…నెమ్మదిగా కదుపుతారు. అధికార హస్తగతదిశలో దక్షిణాదిన పాగా వేయాలని

భావిస్తున్న కమలనాథులకు అనుకోని వరం ఛత్తీస్‌ ఘఢ్‌ మాజీ ముఖ్యమంత్రి కుమారుడి శిక్ష

రూపంలో వచ్చింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు

కేటీఆర్‌, మంత్రులు, సహచర గులాబీ శాసన సభ్యులకు న్యాయపరంగా ఉచ్చు బీగిసే అవకాశం

ఉంది. ఈ విషయాన్ని డిసెంబర్‌ 5, 2018 నాడు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఒక్క పత్రిక మాత్రమే

చెప్పింది.

ఇప్పుడేం జరిగింది..: ఛతీస్‌ఘఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజిత్‌ జోగి

కుమారుడు అమిత్‌ జోగిని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల

అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బిలాస్‌

పూర్‌ పోలీసులు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 2013లో

జరిగిన ఎన్నికల్లో మార్వాహీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అమిత్‌ జోగి తాను పుట్టిన

ప్రాంతానికి సంబంధించి తప్పుడు సమాచారం అఫిడవిట్‌ లో సమర్పించారని ఆరోపిస్తూ భాజపా

అభ్యర్థి సమీరా పైక్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్‌ 1977లో టెక్సాస్లో జన్మించినప్పటికీ..

ఆయన అఫిడవిట్లో మాత్రం ఛత్తీస్గఢ్లోని సర్బేహెరా గౌరెలా గ్రామంలో 1978లో జన్మించినట్టు

తప్పుడు సమాచారం సమర్పించారని ఆరోపించారు. దీనిపై దాదాపు ఆరు నెలల పాటు దర్యాప్తు

చేసిన పోలీసులు.. ఈ రోజు అమిత్‌ జోగిని అరెస్టు చేశారు. ఇటీవలే మాజీ సీఎం అజిత్‌ జోగి కూడా

గిరిజనుడు కాదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ తేల్చిన విషయం తెలిసిందే.

అది మరో కేసు కానుంది.

ఃూచీ:

సీఎం కేసీఆర్‌ అఫిడవిట్‌ లో అబద్దాలా..?

? హక్కులేని భూమిపై అజమాయిషీ

? పేద ముస్లిం భూమికి ఎసరు.?

? కుమారు’డి మాట్‌’ ఎకౌంట్‌..!

ఉద్యమపార్టీ… రాజకీయపార్టీగా మారగానే తెలంగాణ గాంధీకి ఏమైంది..? ఆయనకు తెలియకుండా

ఇవన్నీ జరిగే అవకాశం లేదు. కానీ ఆధారాలన్నీ అఫిడవిట్‌ రూపంలో కళ్ళముందు

‘జనపదనాట్యం’ చేస్తూ.. తిరుగులేకుండా కదిలాడుతున్నాయి. సాక్షాత్తూ కేసీఆర్‌ ప్రమాణపత్రంలోనే

ఆబద్దాలు ఉండటం.. షాకింగ్‌ విషయం. ఇక కాబోయే ముఖ్యమంత్రిగా తెరపై కనిపించే గులాబీ

యువనేత కూడా తన ఎన్నికల అఫిడవిట్‌ లో ప్రస్థావించని సంఘటనలు ఊహకందనీ వాస్తవ

సంఘటనలు.

అసలు కథ..సెక్యురిటీ భూమితో మొదలు..:

సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామం. సర్వే నెంబర్‌ 1048లో 16 ఎకరాల 7 గుంటల భూమి

షావలీఖాన్‌ పేరుతో ఉంది. ఈ భూమిలో 6 ఎకరాల 6 గుంటల భూమిని ఏప్రిల్‌ 4, 1969లో

(డాక్యుమెంట్‌ నెంబర్‌ 263/1969) అమ్మారు. ఇంకో సర్వే నెంబర్‌ లో 10 ఎకరాల ఒక గుంట

భూమి మిగిలింది. కాలక్రమేణ ఆయన వారసులలో మొదటి వారసుడు అజీన్‌ ఖాన్‌ ఐదెకరాల

భూమిని మల్లారెడ్డికి ఆగష్టు12, 1985 (డాక్యుమెంట్‌ నెంబర్‌ 485/1985) అమ్మారు. మరో

వారసుడు మహ్మద్‌ హుస్సేన్‌ ఖాన్‌ తన వారసులైన తేజ్‌ ఖాన్‌, శిరాజ్‌ ఖాన్‌, రియాజ్‌ ఖాన్‌, నజీర్‌

ఖాన్‌ లకు ఇంకా 4 ఎకరాల 26 గుంటల భూమి ఉంది.

ఈ భూమిని ‘మాయ’ దొంగలెత్తుకెళ్ళారు..:

1048 సర్వే నెంబర్‌ లోని 4 ఎకరాల భూమిలో రెవెన్యు రికార్డులలో ముందు ఓ 2 ఎకరాలు

గల్లంతైంది. అ తరువాత మిగిలిన 2.36 గుంటల భూమి కూడా ఘరానా దొంగలు ఎత్తుకెళ్ళినట్లు

చటుక్కున మాయం అయింది.

వీరెలా వచ్చారు..:

1048 సర్వే నెంబరు భూమిలోకి రికార్డుల పరంగా ఆశిరెడ్డి, నర్సింహారెడ్డి పేర్లు ఎక్కాయి.

అంచెలంచెలుగా ఉన్నతాధికారులు అయిన జాన్‌ వెస్లీ, రెవెన్యూ ఉద్యోగులు, కల్వకుంట్ల శైలజ,

ఎంపీ సంతోష్‌ పేర్లు కూడా అలా.. అలా వచ్చి చేరాయి. అనంతరం ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల

చంద్రశేఖర్‌ రావు పేరు కూడా వచ్చి చేరింది. అంటే హక్కు లేని యజమాని నుంచి కేసీఆర్‌ ఈ

భూమి కొనుగోలు చేశారు.

సమాధిలో ఫిర్యాదు:

సర్వే నెంబర్‌ 1048లోని సర్వే నెంబరుకు సంబంధించి జులై 20, 2015న శిరాజ్‌ ఖాన్‌ స్వయంగా

రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు

ఆదేశాలు వెళ్ళాయి. ఫిర్యాదు సమాధి అయిన విషయం తెలియక ఇంకా అమాయకంగా రెవెన్యూ

ఆఫీస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కేసిఆర్‌ తప్పు చేశారా..?:

పిర్యాదు అందిన తరువాత అది వివాదాస్పద భూమి. అయితే కేసీఆర్‌ ఎక్కడా వివాదస్పద భూమి

అని తన ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కోలేదు. అలాగే రెవెన్యూ రికార్డుల ప్రకారం కేసీఆర్‌ పేరుతో

2.0125 ఎకరాలు అని ఉంది. అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ లో సీరియల్‌

నెంబర్‌ రెండులో 2 ఎకరాల 4 కుంటల భూమి అని స్పంష్టంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా…

కేసీఆర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ లో ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం

ఇవ్వలేదని ఇలా చేయటం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ(3)ను ఉల్లంఘించినట్లేనని ఓ

పౌరుడు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీచేసే ప్రతి ఒక్కరూ

తమపై ఉన్న కేసుల వివరాల్ని సంపూర్ణంగా ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్‌ ఎన్నికల కమీషన్‌ కు

సమర్పించిన అఫిడవిట్‌ లో నిజాలు చెప్పారా..? లేదా ఆబద్దాలు కావాలని చెప్పారా..? అనేది

ముందు ఎన్నికల సంఘం.. ఆ తరువాత న్యాయస్థానం తేల్చాల్సిన విషయం.

తనయుడి అఫిడవిట్‌ లో దాచిన ‘హిమాంషు’ కథ:

కేటీఆర్‌ తన అఫిడవిట్‌ లో కాలం నెంబర్‌ 3లో తనకు డి మాట్‌ అకౌంట్‌ ప్రస్థావించారు. అందులో 9

లక్షల 36 వేల 339 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కార్పొరేట్‌ వ్యవహారాల

మంత్రిత్వశాఖ అంతర్జాలంలో కేటీఆర్‌ హిమాంశు మోటర్స్‌ లో డైరెక్టర్‌ గా ఉన్నట్లు చూపుతోంది.

దీంతో కేటీఆర్‌ హిమాంశులో డైరెక్టర్‌ గా ఉన్న విషయం దాచి పెట్టినట్లే.

వీరేం తక్కవ తినలేదు..:

ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ‘ట్రాఫిక్‌’ నిర్వాకం దాచి పెట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల

సందర్భంగా నవంబర్‌ 13న ఒకటి, 19న మరొక నామినేషన్‌ సెట్‌ ఆయన దాఖలు చేశారు. ఆ

అఫిడవిట్‌ లో

సదరు మంత్రివర్యులు చాలా విషయాలకు సంబంధించి అఫిడవిట్‌ లో ఆబద్దాలు చెప్పారు.

మంత్రిగారు 2016లో రూ. 30 లక్షల విలువైన ఫార్చ్యూన్‌ వాహనం (నెం. టిఎస్‌ 0ఇఎల్‌ 6666)

కొనుగోలు చేశారు. ఈ వాహనం ఆగష్టు 3, 2016 నుంచి మే 21, 2019 వరకు సరిగ్గా 41 సార్లు

ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించారు.అందుకుగాను ఆ వాహనానికి సంబంధించి రూ.46,535లు

అక్షరాలా జరిమానా కట్టాల్సి ఉంది.

ఇక ఆయన సతీమణి విరసనోళ్ళ శారద పేరుమీద ఉన్న ఓల్వా (నెం. టిఎస్‌06ఇఆర్‌ 6666)

వాహనాన్ని 2017లో అక్షరాలా 71లక్షల 82వేల రూపాయలతో కొనుగోలు చేశారు. జులై 22,

2017 నుంచి ఏప్రిల్‌ 7, 2019 వరకు సరిగ్గా 14 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించారు.

రూ.16,390లు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందకు జరిమానా కట్టాల్సి ఉంది. అఫిడవిట్‌ లో

నో డ్యూస్‌ చూపడం గమనార్హం.

షకల..షకల.. షకీల్‌..:

తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే షకీల్‌ అయితే తనకు ‘నాట్‌ అప్లికబుల్‌’ అంటూ…

అఫిడవిట్‌ లో రాసిచ్చాడు.

ఆంధ్రప్రదేశ్‌ లో…:

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తన అఫిడవిట్‌

ఫారం?26లో 5వ కాలమ్‌ లో ‘అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్‌ కేసులున్నాయా..? లేవా..?’ అనే దగ్గర

ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అయితే ఓబుళాపురం మైనింగ్‌ వద్ద 144

సెక్షన్‌ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి మైనింగ్‌ కార్యాలయానికి వెళ్ళారు.

అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి, అక్కడి ఆస్తులు

ద్వంసం చేశారని రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు

చేశారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్‌ కూడా

జారీచేసింది. తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ

అయింది. విజయవాడ న్యాయస్థానం కూడా 2018, డిసెంబర్‌ 28న కేసు నంబరు 50గా

నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చింది. ఈ కేసు గురించి అఫిడవిట్‌ లో ఎక్కడా ప్రస్థావించలేదు.

2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్‌ పొందుతున్నారని, 2019 ఎన్నికలో

ఉప ముఖ్యమంత్రి, ¬ం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై

ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ ను మరో మోసం చేశారనే కోణం

వెలుగుచూసింది.

వివరాలు దాచిన కుటుం’బలరాం’:

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి సమర్పించిన అఫిడవిట్‌ లో

భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య

‘ప్రసూన’ గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు.

ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. ఫామ్‌-26లో డిపెండెంట్‌

1, 2, 3 కాలంలో ‘నిల్‌’ అని చూపించారు. ప్రసూనకు సంబంధించిన రాబడి, ఆస్తులు, బంగారం,

బాధ్యతల గురించి ప్రస్తావించలేదు. నామినేషన్లో భార్య, కుమార్తెల విషయం ప్రస్తావించలేదు.

1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. వారికి ‘అంబిక కృష్ణ’

1989లో హైదరాబాద్‌ లోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక కృష్ణ ‘ఎస్‌ఎస్సీ

సర్టిఫికెట్లో, ఆధార్‌ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి’ అని ఉంది. అంబిక కృష్ణ

అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం

ఉన్నారు. ‘అంబిక కృష్ణ’ ప్రస్తుతం ఎల్‌ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన,

అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఫామ్‌-26లో డిపెండెంట్‌ 1, 2, 3

కాలంలో ‘నిల్‌’ అని చూపించారు. ప్రసూనకు సంబంధించిన రాబడి, ఆస్తులు, బంగారం, బాధ్యతల

గురించి ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు కరణం బలరాం మెడకు ‘అనకొండ’లా చుట్టుకుంది.

‘మద్దాలీ’ నీ ముద్దుల బ్యాంకు రుణాల కథ ఏంటి…?:

‘గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్రావ్‌ వివిధ

పేర్లతో పలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేశారు. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కు

తెలియపరచలేదు. రుణ వివరాలను దాచి ఈసీని తప్పుదోవ పట్టించినందుకు గాను ఆయన ఎన్నిక

చెల్లదు. దీనికి తోడు

నియోజకవర్గంలో మొత్తం 4040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లొస్తే.. అందులో 312 మాత్రమే చెల్లినట్లు ఆర్వో

పేర్కొన్నారు. తొలుత ఎన్నికల విధులకు ప్రైవేటు టీచర్లను కూడా ఉపయోగించుకోవాలనుకున్న

ఈసీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ గందరగోళంతో ప్రైవేటు టీచర్లు పోస్టల్‌ బ్యాలెట్‌

తోపాటు మామూలు ఓటును కూడా వినియోగించుకున్నారు. దీంతో వారు రెండుసార్లు

ఓటేసినట్లయ్యింది. ఆఖరి నిమిషంలో విధులకు వెళ్లిన ప్రభుత్వ టీచర్లు ఓటు హక్కును

ఉపయోగించుకోలేక పోయారు. ఈ ప్రభావం ఫలితాలపై పడింది. ఇదే ఇప్పుడు ఈయన ఎన్నికపై

ప్రభావం పడనుంది.

ఃనీలీ :

ఇలా చట్ట ప్రకారం నేరం:

ఏదైనా అవినీతి, అక్రమం మీడియా వెలుగులోకి తెస్తే సహజంగా రాజకీయాలు సాకులు

వెతుకుతారు. అందుకు తగ్గ అధికారులు వంత పాడతారు. అందుకే ఎన్నికల చట్టం, అందులో ఎ

సెక్షన్‌ ప్రకారం నేరం జరిగింది.. అనే కోణం ఇది.

1961 నాటి ఎన్నికల నిబంధనలను ఆగస్టు1, 2012న ఎన్నికల కమిషన్‌ సవరించింది. ఈ

నిబంధనలను అఫిడవిట్‌ ఫార్మేట్లో పొందుపరిచింది. దీని ప్రకారం అభ్యర్థులు తమ ఆస్తులు, ఇతర

ఆదాయ వనరులు, భార్య, ప్రసూనకు సంబంధించిన రాబడి, ఆస్తులు, బంగారం, బాధ్యతల గురించి

ప్రస్తావించలేదు. సభ్యుల ఆస్తులు, ఇతర వివరాలు, నేర చరిత్ర, విద్యార్హతలు ఇవన్నీ అఫిడవిట్లో

తప్పనిసరిగా పేర్కొనాలి. అభ్యర్థులు తమ అఫిడవిట్లో అవాస్తవాలు వెల్లడించినా, లేదా గోప్యంగా

ఉంచినా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల నేరంగా పరిగణిస్తారు. సెక్షన్‌ 125(ఎ) నిబంధనల

ప్రకారం ఆరు నెలల వరకు జైలుశిక్ష లేదా అపరాధరుసుం చెల్లింపు తప్పనిసరిగా విధించ

బడుతుంది. శాసన సభ్యత్వం కూడా తప్పక రద్దవుతుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close