కోదండరాంపైనే కెసిఆర్‌ నజర్‌..

0

మహకూటమిలో ఎవరైనా గెలవనియ్యి.. ఉత్తమ్‌ కుమార్‌ అసెంబ్లీ వచ్చిన పర్వాలేదు, మన అసమ్మతి నాయకులు గెలిచి ప్రతిపక్షంలో ఉన్న మనకు సంబంధం లేదు. కాని ఆరునూరైనా తెలంగాణ జనసమితి అధినేత గెలవకూడదు. అక్కడ ఏం చేస్తారో, ఏలా పరిణామాలు మారుస్తారో తెలియదు కాని కోదండరాం అసెంబ్లీలో అడుగుపెట్టొద్దని తన సన్నిహిత నాయకులకు కెసిఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ముందస్తు ఎన్నికల్లో మజా హద్దులు దాటుతోంది. ప్రత్యర్థుల మధ్య పోటీ రోజురోజుకి తీవ్రతరంగా మారుతోంది. ఒకరి ఓటమి కోసం మరొకరు ప్రణాళికల మీద ప్రణాళికలు రూపోందిస్తున్నారు. తెలంగాణ జన సమితి రూపకర్త కోదండరాంపై పోటీ చేసే స్థానంపై తెలంగాణ అధినేత కెసిఆర్‌ ప్రత్యేక ద ష్టి పెట్టారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. విజయావకాశాలు ఏలా ఉంటాయి అనే వివిధ ఆంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మహకూటమి పొత్తులు ఒక కొలిక్కి వస్తున్నాయని రెండు, మూడు రోజుల్లో ఎవరు, ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో తెలిసే అవకాశముంది. టిజెఎస్‌ పార్టీ కేటాయించిన స్థానాలలో కోదండరాం కూడా పోటీ చేస్తున్నారు. సీట్ల పంపకంలో కోదండరాం రామగుండం నుంచి కూడా బరిలోకి దిగుతున్నారని తెలియడంతో కెసిఆర్‌ అతను అక్కడి నుండి గెలవకుండా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి తన కుమారుడు కెటిఆర్‌ ను పంపి కోదండరాం గెలవకుండా అతనిని డీ కొట్టెలా ప్రతి అంశాన్ని, ప్రతి అవకాశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం.

కోదండరాం విషయంలో కెసిఆర్‌ వ్యతిరేకత

కోదండరాం విషయంలో గులాబీ అధినేత కెసిఆర్‌ బాగా వ్యతిరేకతగా ఉన్నారు. ఆయను ఎన్నికల బరిలో దిగుతున్నాడని, ఆయన గెలవకూడదని, అస్సలు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని పార్టీ నేతలకు చెప్పారట. రామగుండం వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని కెటిఆర్‌ కు చూసించినట్లు చెపుతున్నారు. ఆ స్థానంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్‌ రిపోర్టు కూడా తెప్పించుకున్నారని కెసిఆర్‌ సన్నిహితులు చెపుతున్నారు. రామగుండంలో కోదండరాంకు అనుకూలంగా ఎవరు ఉన్నారు. ఆయన ప్రచారానికి ఎవరెవరు వస్తున్నారు. టిజెఎసి నాయకులు ఎంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారనే వివిధ ఆంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కోదండరాంపై ఇంతలా నిఘా పెట్టిన కెసిఆర్‌ గజ్వేలు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన ద ష్టి అంతా ప్రధానంగా కోదండరాంపైనే ఎక్కువగా పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్‌ కూడా ఎన్ని తక్కువ సీట్లు కేటాయిస్తే అంత మంచి అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి కోదండరాం పోటీ చేసిన ఆయన స్థానికేతరుడని, ఆయనకు నియోజకవర్గ విషయాలపై అసలు అవగాహన లేదని అక్కడి స్థానిక టిఆర్‌ఎస్‌ నేతలు మాటల దాడి ప్రారంభించారు. కోదండరాం ఓటమిపైనే కెసిఆర్‌ నజర్‌ పెట్టడం మహాకూటమిలోనూ పెద్ద చర్చ జరుగుతొంది. ఒకవేళ కోదండరాం గెలిస్తే చారిత్రాత్మకమవుతుందని అంటున్నారు టిజెఎస్‌ నాయకులు. అసలు కెసిఆర్‌ కోదండరాంపై ఎందుకు అంత కక్ష అని చర్చించుకుంటున్నారు. మరో వైపు కోదండరాం తన గెలుపుకు సంబంధించిన అన్ని అవకాశం ఉన్న అంశాలను సేకరిస్తున్నారు. బంగారు తెలంగాణ పేరిట తెరాస ప్రభుత్వం అధికారంలో ఉండి చేసిందీ మాత్రం ఏమి లేదని, అమలుకాని పథకాలను ఇచ్చి ప్రజలను కెసిఆర్‌ మోసం చేశారని నిరుద్యోగులను, తనతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరిని తనతో పాటు కలుపుకునేలా టిజెఎస్‌ ప్రణాళిక రూపోందిస్తుంది. ఎంతోమంది బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, మన సాధించుకున్న తెలంగాణ కుటుంబ పాలనగా మారిపోయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కెసిఆర్‌ కోదండరాం స్థానంపై ఎంత ద ష్టి పెట్టినా కోదండరాం గెలుపుకోసం శాయశక్తుల క షి చేస్తామంటున్నారు టిజెఎస్‌ నాయకులు. కోదండరాం సీటుపై ద ష్టి పెట్టిన కెసిఆర్‌ ఆయన గెలుపును ఎంతవరకు ప్రభావితం చేయగలరో చూడాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here