Featuredరాజకీయ వార్తలు

నేడు ఢిల్లీకి కేసీఆర్‌..

  • హస్తిన పర్యటన వెనుక ఆంతర్యం..?
  • ఐఐఎంపై ప్రధానంగా చర్చించే అవకాశం
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌, విభజన హామీలపైనా చర్చ
  • కేందమంత్రుల్ని కలవనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సీఎంవో కార్యాలయం సమాచారం అందించింది. అలాగే ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రితో భేటీలో ప్రధానంగా.. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ ¬దా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. కేసీఆర్‌ ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close