నేడే మంత్రి వర్గవిస్తరణ

0
  • ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం
  • తొమ్మిదికి తొలి జాబితాలో అవకాశం
  • ఇప్పటికే పేర్లను ఖరారుచేసిన కేసీఆర్‌
  • కేసీఆర్‌ను కలిసిన కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి
  • ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మలి విడతలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు చేసిన నేతలతో భేటీ అయ్యారు. కేబినెట్‌లో బెర్త్‌ కోసం ఆశగా ఉన్న ఎమ్మెల్యేలు సీఎంఓ నుండి ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు రేపటి మంత్రివర్గంలో కేటీఆర్‌ కు ఛాన్స్‌ ఉండకపోవచ్చని చెబుతున్నారు. కేటీఆర్‌కు ఛాన్స్‌ దక్కని పరిస్థితుల్లో హరీష్‌ రావుకు కూడ మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు ప్రశాంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌లు సీఎం కార్యాలయం నుండి ఫోన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.మహిళా కోటా నుండి పద్మా దేవేందర్‌ రెడ్డికి చాన్స్‌ దక్కే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రేపటి మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌కు ఛాన్స్‌ ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే హరీష్‌ రావుకు కూడ ఛాన్స్‌ ఉండకపోవచ్చని సమాచారం. మరో వైపు సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ విషయమై కూడ ఇంకా స్పష్టత రాలేదు.

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌ భవన్‌ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా రాజ్‌ భవన్‌ కు చేరగా, ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారిని గవర్నర్‌ కార్యాలయ అధికారులు ఆహ్వానిస్తున్నారు. క్యాబినెట్‌ లో 8 నుంచి 10 మందికి స్థానం లభించనున్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్న కేసీఆర్‌, తన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీశ్‌ రావులను ప్రస్తుతానికి దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రుల జాబితా ఇప్పటికే లీకైంది కూడా. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని, గత రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌ భవన్‌ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది. మంత్రి వర్గంలోకి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత దక్కనున్నట్లు తెలుస్తంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో పాతవారు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి వర్గంలో కొత్తవారికి కేసీఆర్‌ ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు తెలిసింది. వీరిలో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల ప్రచార సమయంలో నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్‌ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు హావిూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో నిరంజన్‌రెడ్డికి బెర్త్‌ ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్‌నగర్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి వర్గంలో బెర్త్‌ ఖాయమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్‌ నుంచి వేముల ప్రశాంత్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బెర్త్‌ లు ఖరారైనట్లు తెరాస వర్గాలు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్‌ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సీఎం కేసీఆర్‌ను కలిసిశారు. ఈ సందర్భంగా వీరికి కేటాయించే శాఖలపైనా కేసీఆర్‌ తెలిపినట్లు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది.

ఏర్పాట్లు పూర్తి..

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగనున్న విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌ లాన్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది రిహార్సల్‌ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ¬ంమంత్రి మహమూద్‌ అలీ, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రొటోకాల్‌ విభాగం నుంచి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here