సినిమా వార్తలు

హాటెస్ట్‌ బికినీలో కత్రినా

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ గురించి అసలు ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. అంత పాపులారిటీ ఉంది కత్రీనాకు. పదిహేనేళ్ళ క్రితం హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కత్రినా ఇప్పటివరకూ హీరోయిన్‌ గా కొనసాగడం ఒక గొప్ప విషయం అయితే ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచు కుంటూ ఉండడం మరో గొప్ప విషయం. తాజాగా కత్రిన ప్రముఖ మ్యాగజైన్‌ ఎలి కోసం ఫోటో షూట్‌ లో పాల్గొంది. ఆ గ్లామరస్‌ ఫోటో షూట్‌ నుండి ఒక ఫోటోను మాత్రమే తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్‌ చేసింది కానీ ఎలి ఇండియా వారు మరి కొన్ని క్రేజీ ఫోటోలను తమ అధికారిక ఇన్స్టా పేజ్‌ ద్వారా షేర్‌ చేశారు. ఒక ఫోటోకు ఇలా క్యాప్షన్‌ ఇచ్చారు. ”కత్రినా కైఫ్‌ మా మే నెల కవర్‌ స్టార్‌. రాజీవ్‌ మసంద్‌ ఇంటర్వ్యూలో కత్రినా తనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.” ఇక ఫోటో చూస్తే అదిరిపోయింది. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ లో కిరాక్‌ బికినీ ధరించింది. ఎల్లో.. పింక్‌ కాంబి నేషన్‌ లో టాప్‌.. రెడ్‌ కలర్‌ బాటం తో పైన ఒక స్టోల్‌ లాంటి దాన్ని అలా వేసుకుంది. కాస్త గజిబిజిగా స్టైలింగ్‌ చేసిన లూజ్‌ హెయిర్‌ తో తల వెనక్కు వాల్చి ఓ ఘాటు ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చింది. ఈ ఫోటోలో బికినీకి వేలాడే రెండు స్ట్రాప్స్‌ మధ్యలో నాభి అందాలను ప్రదర్శించింది. హాట్‌ నెస్‌ ఈ రేంజ్‌ లో ఉంది కాబట్టే కత్రినాను 21 మిలియన్ల నెటిజనులు ఎంతో శ్రద్ధగా ఫాలో అవుతున్నారు. ఈ ఫోటోకు ‘ది బెస్ట్‌ బికినీ అవతార్‌’ అని ఒక నెటిజన్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. మరొకరు.. ”ఇంకా ఇంకా కావాలి నాకు ఇలాంటి బికినీ ఫోటోలే కావాలి” అని ఇంగ్లీష్‌ లో రిక్వెస్ట్‌ చేశాడు. ఇంకో నెటిజనుడు ‘ది బికినీ ప్రిన్సెస్‌’ అంటూ ట్యాగ్‌ ఇచ్చాడు. మరొకరు ”హాట్‌ నెస్‌ అంటే ఇది” అన్నారు. ఇక మరో ఫోటోలో వైట్‌ టాప్‌.. వైట్‌ మిని నిక్కర్‌ వేసుకుంది. సేమ్‌ డిజైన్‌ లో ఉండే జాకెట్‌ లాంటిది వేసుకున్నప్పటికీ బటన్స్‌ పెట్టుకోకపోవడంతో ఆమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటోలో జుట్టు మొహంపై పడడంతో అందాల ఆడ అపరిచితు రాలిలాగా ఉంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close