Featuredస్టేట్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నదీతీరాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు

హైదరాబాద్‌

మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం కావడంతో పలు చోటల్‌ కార్తీక స్నానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నదీతఈర ప్రాంతాల పుణ్యక్షేత్రాల్లో కార్తీక స్నానాలతో పుణ్యక్షేత్రాల్లో భక్తులు పూజలు చేపట్టారు. భద్రాచలం, బాసర, ధర్మపురి, వేములవాడ, శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరించి పూఝలు చేశారు. మహిళలు వత్తులు వెలిగించి దీపారాధనలు చేపట్టారు. రాష్టాల్లోన్రి శైవాలయాల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానాన్ని ఈ మాసంలో మొత్తం 20లక్షలమంది పైగా భక్తులు దర్శిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. రెండో శనివారం, ఆదివారం వంటి సెలవుదినాలు, సోమవారం, కార్తీకపౌర్ణమి మొదలైన రోజుల్లో లక్షమందికి పైగా వస్తారని తెలిపారు. రద్దీ రోజుల్లో వేకువజామున 4గంటల నుంచి స్వామిఅమ్మవార్ల దర్శ నానికి అనుమతిస్తామని, సుప్రభాతసేవ, మహామంగళహారతి, లక్ష కుంకుమార్చన, నవావరణపూజ, బిల్వార్చన తదితర ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. ఆర్జిత చండీ¬మాలు, రుద్ర¬మా లు రెండు విడతలుగా నిర్వహిస్తామన్నారు. భక్తులు దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద, ఆలయం ఎదురు గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీకమాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజులలో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామ ని తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా త్రివేణి సంఘమ క్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ ముక్తీశ్వర స్వామి సన్నిధానంలోనూ కార్తీకమాస ప్రత్యేక పూజలు అంగరంగవైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షపత్రి పూజలు, లక్ష దీపోత్సవం, లక్షవత్తు వేడుకలు నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల రోజు లపాటు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. నవంబరు 4, 11, 18, 25తేదీలలో సోమవారం సందర్భంగా ఉదయం శ్రీరాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మూడో సోమవారమైన నవంబరు 18మినహా మిగతా 3సోమవారాలలో మహాలింగార్చన నిర్వహిస్తారు. 18న మూడో సోమవారం శ్రీభీమేశ్వరాలయంలో మహాలింగార్చన నిర్వహిస్తారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close