Featuredస్టేట్ న్యూస్

కర్ణాటక పొలిటికల్‌ సెమీ ఫైనల్‌…

మరో రెండు వికెట్లు ఔట్‌

  • గవర్నర్‌తో యడ్యూరప్ప భేటీ
  • కోర్టుకెక్కిన అసమ్మతి ఎమ్మెల్యేలు
  • నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌
  • ¬టల్‌ పరిసరాల్లో 144సెక్షన్‌ విధింపు

బెంగళూరు : కర్ణాటకలో పొలిటికల్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది. బుధవారం మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో మొత్తం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కి చేరింది.దీంతో కర్ణాటకలో రాజకీయ

సంక్షోభం మరింత ముదిరింది. రాష్ట్రంలో పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందున అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప

కోరారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం సాయంత్రం యడ్యూరప్ప గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాతో సమావేశమయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ… కుమారస్వామి సర్కార్‌కు

తగినంత సంఖ్యా బలం లేనందున తక్షణమే సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కుమారస్వామికి లేదని అన్నారు. మరోవైపు ముంబై ¬టల్‌లో

అసమ్మతి ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నించిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ముంబైలో మంత్రులు, ఎమ్మెల్యేలను

పోలీసులు అడ్డగించడం చూస్తుంటే బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన తీరు కన్పిస్తోందని ఆరోపించారు.

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకు రక్తికట్టిస్తున్నాయి.. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కుమారస్వామి ప్రభుత్వంకు బలంలేదని, వెంటనే 

రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుండగా.. అసమ్మతి ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారని, కావాలని బీజేపీ వారిని ప్రలోబపెట్టి క్యాంపులకు తరలించిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఆరోపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్ణాటక

రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌ రాజ్యాంగవిరుద్ధంగా

వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. దీనిపై గురువారం విచారణ

చేపట్టనుంది. ఇదిలాఉంటే అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. మరోరోజు వచ్చి రాజీనామాలు సమర్పించి, దానికి సహేతుకమైన వివరణ

ఇవ్వాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. దీంతో రెబల్‌ ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంలో పడినట్లయింది.

ముంబై ¬టల్‌ ఎదుట శివకుమార్‌ మకాం..

రాజీనామాలు చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ ¬టల్‌లో మకాం పెట్టారు. దీంతో కన్నడ రాజకీయానికి ముంబై కేంద్రమైంది. అసమ్మతి ఎమ్మెల్యేల్లో కొంతమందినైనా బుజ్జగిస్తే రాజీనామా 

ఉపసంహారణ చేసుకునేలా చేస్తే ప్రభుత్వం గండం నుండి గ్టటెక్కుతుందని కాంగ్రెస్‌, జీడీఎస్‌ నేతలు భావించారు. ఇందుకోసం రాయబారానికి కాంగ్రెస్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌, జీడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడను ముంబై పంపారు.

వీరిద్దరూ ¬టల్‌ వద్దకు చేరుకొని లోపలున్న ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాటికి అడ్డుపడ్డారు. లోపలున్న ఎమ్మెల్యేలు తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరడంతో వారిని ¬టల్‌లోకి

వెళ్లనీయలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా శివకుమార్‌ మాట్లాడుతూ.. స్నేహితులను కలిసేందుకే ఇక్కడకు వచ్చానని, అంతా బాగానే జరుగుతోందని, టెంక్షన్‌ పడాల్సిన పనిలేదని అన్నారు.

మరోవైపు ¬టల్‌ బయట శివకుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. శివకుమార్‌ వెంటనే వెనక్కి వెళ్లాలంటూ బీజేపీ మద్దతుదారుల నినాదాలు చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని రెబెల్‌

ఎమ్మెల్యేలు కోరగా ఎమ్మెల్యేలు బసచేసిన ¬టల్‌ వద్ద జవాన్లతో భద్రత ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలకు ముప్పు కలిగే ప్రమాదం ఉన్నందున పోవాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 144సెక్షన్‌ విధిస్తున్నట్లు గ్రేటర్‌ ముంబయి పోలీస్‌

కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనిప్రకారం ఈ ప్రాంతంలో నలుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదు. జులై 12 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భేదాభిప్రాయాలు వచ్చినంతమాత్రాన విడిపోయినట్లు కాదు – శివకుమార్‌

ఈ సందర్భంగా శివకుమార్‌ విలేకరులతో మాట్లాడారు.. మేము.. మా స్నేహితులు 30,40 సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాల్లో ఉంటున్నామన్నారు. తల్లీదండ్రులకు, భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, 

స్నేహితులకు మధ్య ఒక్కోసారి బేధాభిప్రాయాలు వస్తుంటాయని, అంత మాత్రాన శాశ్వతంగా దూరమై పోరన్నారు. సంసారంలో గొడవలు వచ్చి భార్య బయటకు వెళ్లిపోతే విడాకులు ఇచ్చేసినట్లేనా.. సంసారంలో ఇవన్నీ మామూలే

అంటూ పేర్కొన్నారు. ఎవరో ఒకరు వారి మధ్య సయోధ్య కుదర్చాలని, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని శివకుమార్‌ అన్నారు. నేడు ఎమ్మెల్యేలు గొడవపడి బయటకు వచ్చేశారని, బయటకు వచ్చేసినంత మాత్రాన కాంగ్రెస్‌తో

శాశ్వతంగా బంధాలు తెంచుకున్నట్లు కాదన్నారు. నాతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు ఈ రోజు బయటకు వచ్చేశారని, అందుకే వాళ్లతో మాట్లాడదామని నేను ఇక్కడకు వచ్చానని, పోలీసులు నన్ను అడ్డగించారని

అన్నారు.. ఈ బీజేపీ వాళ్లు నాటకాలు చేస్తున్నారని శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధానసౌధ వద్ద బీజేపీ ఆందోళన..

కర్ణాటక విధానసౌధ వద్ద మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ తక్షణమే అమోదించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ 

సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. గవర్నర్‌, స్పీకర్‌ను కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తానని అన్నారు. కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని, కాంగ్రెస్‌ -జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో

పడిందన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను ఆమోదించకుండా ఆలస్యం చేయడం సరికాదన్నారు. వెంటనే స్పీకర్‌ నిర్ణయంతీసుకోవాలని కోరారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close