కల్వ’కోట్ల కుటుంబం’

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పేరు పరిచయం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు ఒడ్డిన గాంధీ కేసిఆర్‌. ఆయన తప్ప మిగిలిన కుటుంబ సభ్యులంతా…కొన్ని కంపెనీలలో డైరెక్టర్లుగా కొనసాగు తున్నారు. అందులో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆ,యా కంపెనీలలో బంధుగణం, మిత్రబృందం అంతా కలసి ఈ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల కథ ఏమిటి: ప్రభుత్వానికి ఈ కంపెనీలకు లింకేమిటి అనే విషయంలో ఓ ఊహించని ‘ఇచ్చి పుచ్చుకునే కూపీ’ బయటకు వచ్చింది. హాల్మార్క్‌న్ఫ్ఫ్రా-కాన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిజనస్‌న్ఫ్ఫ్రా అండ్‌ రికాన్కన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కారోలినా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెర్‌ టెక్స్‌ ఇంజనీరింగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిఎస్‌ఎస్‌ సహజ వనరుల ప్రైవేటు సంస్థ, సియాన్‌న్ఫ్ఫ్రా, ఆకార మైనింగ్‌, ఒయర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాశాష్టా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అక్బోబియ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మూవోన్‌ విూడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కర్వి సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌, షార్ప్‌ వెంచర్‌ ప్రైవేట్‌ సంస్థలలో కల్వకుంట్ల బంధువులు, సన్నిహితులు భాగస్వామ్యులుగా ఉన్నారు. వీరిపైనే.. ఆరోపణలు: 2016-17 సంవత్సరాలలో ఈ సంస్థల ఏర్పాటు జరిగాయి. ఇందులో ప్రధానంగా ‘కాల్‌ హెల్త్‌’కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పై సంస్థలలో ఓ మంత్రి పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30% వాటాలతో అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియా పసిఫిక్‌ దేశాలకు అంతర్గతంగా విస్తరించిని ఈ సంస్థ బాగోగులను ఇప్పటికే తేజరాజ్‌ పేరు నానుతోంది. తేజరాజ్‌ సత్యం కంప్యూటర్స్‌ రామలింగరాజు పుత్రుడు. తేజారాజ్‌ తో కేటీఆర్‌ మలేషియా ప్రధానమంత్రితో కలవడం సంచలనం కలిగించే విషయం. తేజారాజ్‌ పై ఇప్పటికే 1500 కోట్ల కుంభకోణం వార్తలు ఆందోళన కలిగీస్తున్నాయి. ఈనాటి ఈబంధం.. ఈనాటిదే..!: పైన పేర్కొన్న కంపెనీలలో ముఖ్యమంత్రి బావమరిది పేరు, ఎంపీ భర్త, మేనల్లుడి భార్యతో పాటు మియాపూర్‌ భూ కుంభకోణంలో ఉన్న దామోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఇలా తన అనుయాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)కి ఫిర్యాదు ఐందినట్లు తెలిసింది. ప్రధాన పార్టీల మౌనవ్రతం: దేశంలో జరిగిన ఒకానొక స్కాం… తెలంగాణ రాష్ట్రంలో తుది స్కాం లో ఏకంగా ముఖ్యమంత్రి సమీప బంధువులు ఉన్నా.. కాంగ్రెసు, ఇతర పార్టీలు ఏమాత్రం ఈ విషయాలపై దృష్టి సారించలేదు. కారణాలు ఏమైనప్పటికీ… అటు అధికారపార్టీ తమ నిజాయితీని నిరూపించుకోవలసి ఉండగా.. ప్రతిపక్షాల ¬దాలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను నిరూపించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here