అంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

గీతమ్ లో ఘనంగా కాళోజి జయంతి

పటాన్ చెరు (ఆదాబ్ హైదరాబాద్)ః కాళోజీ నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ రాజ కాళోజీ 105వ జయంతిని సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరబాద్ లో ఘనంగా నిర్వహించారు. కవిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ప్రజాకవిగా పేరొందిన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం విధితమే. గీతమ్ లో నెలకొల్పిన కాళోజీ నారాయణ రావు విగ్రహానికి అదనపు ఉపకులపతి ప్రొ.ఎన్.శివ ప్రసాద్ పుష్పాలతో ఘన నివాళులు అర్పించారు. స్థానిక మాండలికంలో, మరీ ముఖ్యంగా ప్రజల భాషలో రచనలు చేసి వారి మన్ననలు చూరగొన్న కాళోజీ సగటు మానవుల సంక్షేమం కోసమే తన జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఆయన మానవీయ సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తున్నట్లు చెప్పారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొ.ఏ.శ్రీరామ్, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ రావు, పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close