శరవేగంగా కాళేశ్వరం పనులు

0

తుదిదశకు చేరుకున్న నిర్మాణాలు

  • 21న మూహూర్తం ఖరారుతో అధికారుల అప్రమత్తం

కరీంనగర్‌ :

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడంతో పనులను వరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీనికితోడు వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసేలా పురమాయించారు. రాష్ట్రంలో ఉన్నతస్థాయి సాంకేతిక విలువలతో ప్రాతిష్టాత్మకంగా చేపట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కెసిఆర్‌ కలల ప్రాజెక్ట్‌ పనితీరును పదిహేను రోజుల్లో రెండుసార్లు పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.ఇప్పటికే 99శాతం పనులు పూర్తికాగా, ఎత్తిపోతలతో గోదారమ్మ జలాలను పొలాలు తడిపేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఆశతో ఎదురుచూసే మంచిరోజు ఈ నెల 21ననిర్ణయించడంతో పనులు కూడా అంతేవేగంగా పూర్తి కానున్నాయి. తెలంగాణలో ప్రతీ పంట కాలానికి 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం మేరకు కాళేశ్వరం చేపట్టారు. ప్రాజెక్ట్‌కు ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ పనులను ఈనెల 4న సందర్శించిన సీఎం కేసీఆర్‌ వచ్చే ఖరీఫ్‌ కాలానికి గాను పంట పొలాలకు నీరందించేందుకు నిర్ధేశిరచిన లక్షం మేరకు ఈనెల 15లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దానితో అధికారులు ఈ ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోను గడువులోగా పనులు పూర్తిచేయాలనే నిర్ణయంతో ఎండను లెక్కచేయకుండా అధికార యంత్రాంగం పనులు పూర్తిచేయడంపై దృష్టి పెట్టారు. అయితే మేడిగడ్డ బ్యారేజీలో 85గేట్లకు గాను సీఎం కేసీఆర్‌ వచ్చేనాటికి అధికారికంగా 80బిగించడం జరిగిందని, ఈ ఏడు రోజుల్లో మరో ఐదు అమర్చామని, దానితో గేట్ల పని ముగిసిందని ప్రాజెక్ట్‌ ఇఇ రమణారెడ్డి తెలిపారు. ఇంకా సివిల్‌ పనులు మిగిలాయని, గేట్లు లిప్ట్‌లకై టెస్టింగ్‌, అలైన్‌మెంట్‌, ఆప్రాన్‌, క్లీనింగ్‌ వంటి చిన్నా చితకా పనులు ఉన్నాయని, అవి పురోగతిలో ఉన్నాయని, మొత్తానికి 99శాతం పనులు ముగిశాయని, గడువులోపు అన్నీ పూర్తవుతాయని చెప్పారు.

సీఎం కెసిఆర్‌ చొరవతో ఈ మూడు సంవత్సరాల అతి స్వల్ప వ్యవధిలో ఈభారీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తికావడం అపూర్వమని అంటున్నారు. మేడిగడ్డలో నీటి నిల్వ పంపింగ్‌ కోసం నిరంతరం విద్యుత్‌ సరఫరా అయినందున అక్కడ ప్రత్యేకించి 2మెగావాట్ల శక్తిగల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం జరుగుతున్నది. ఈవిద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై ఆధారపడకుండా ఒకవేళ సరఫరాలో అంతరాయం జరిగితే పంపింగ్‌ వ్యవస్థ ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందుకోసం ఒక్కొక్కటి 50కెవి సామర్థంగల

రెండు అతిశక్తివంతమైన జనరేటర్లను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. కన్నెపల్లిలో నీటిని పంపింగ్‌ చేయడానికి గాను 11మోటార్లలో ఇప్పటికే 8మోటార్లను ఇప్పటికే అధికారులు అమర్చారు.పనులు పూర్తయిన వెంటనే వర్షాకాలంలో అనుకున్నట్లు గేట్ల పనులు విజయవంతం అయ్యాక వచ్చే నెలలో లక్షం మేరకు అందరు ఆశించినట్లు పంటలకు నీరివ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన గ్రావిటీ కెనాల్‌ నీరు అప్పట్లో అన్నారం బ్యారేజీకి చేరిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 16టీఎంసీల నీరు అవసరం ఉందని, అయితే 300టీఎంసీల నీరు గోదావరిలో నిరంతరం ప్రవహిస్తుందని అన్నారు. 21న ప్రారంభోత్సవం నాటికి వర్షాలు పడితే మహారాష్ట్ర నుంచి నీరు వస్తే మరింత అద్భుతం ఆవిష్కృతం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here