Featuredస్టేట్ న్యూస్

కాచిగూడ ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

  • ఆగిఉన్న రైలును ఢీకొన్న ఎంఎంటీస్‌ రైలు
  • 30మందికి పైగా గాయలు, పలువురి పరిస్థితి విషమం
  • రైలు డ్రైవర్‌ క్షేమం.. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం
  • ప్రమాద స్థలిని సందర్శించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగిఉన్న కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును, ఎంఎంటీస్‌ రైలు ఢీకొట్టింది. కర్నూల్‌ ఇంటర్‌ సిటీ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టేషన్‌ లో ఓ ట్రాక్‌ పై నిలిపిఉంచారు. ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు బయల్దేరిన ఎంఎంటీఎస్‌ రైలు కూడా అదే ట్రాక్‌ పైకి రావడంతో నిలిపి ఉంచిన రైలును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ పైలట్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో ఆయన్ను బయటకు తీసేందుకు రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలు కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ట్రాక్‌ పై రైలును నిలిపి ఉంచిన తర్వాత.. అదే ట్రాక్‌ పైకి వచ్చేందుకు మరో రైలుకు సిగ్నల్‌ ఎలా ఇస్తారని ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీశారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణీకులకు ప్రాణ నష్టం జరగలేదు. ఒక వేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరూ బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తం కావాలని ప్రయాణికులు సూచించారు. సంఘటన స్థలాన్ని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ పరిశీలించారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, అందుకు కారణమైన సిబ్బందిని వెంటనే సస్పెండ్‌ చేయాలని అన్నారు. గాయపడ్డ వారికి రైల్వే ఆధ్వర్యంలో చికిత్స అందించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

ప్రమాద ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం సమయంలోనే ప్రమాదం జరగడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లారు.

రైలు డ్రైవర్‌ క్షేమం.. 8 గంటల తర్వాత ఇంజిన్‌ నుంచి బయటకు..

కాచిగూడలో ఎంఎంటీఎస్‌ రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత అతడిని సహాయక సిబ్బంది బయటకు తీశారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఉదయం రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ రైలు ఇంజిన్‌ నుజ్జనుజ్జయింది. ఇంజిన్‌ కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్‌ తీవ్రంగా శ్రమించింది. గ్యాస్‌ కట్టర్‌ల సాయంతో ఇంజిన్‌ భాగాలను తొలగించిన ఎట్టకేలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close