కొండగట్టు బాధితులకు పరిహారం మంజూరు

0

జగిత్యాల (ఆదాబ్‌ హైదరాబాద్‌): సెప్టెంబరు 11, 2018 కొండగట్టు బస్సు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేయనున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహా రాన్ని పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు పరిహారం అంద జేయడానికి ఎన్నికల కోడ్‌ నిబంధనలు వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 62 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈనెల 8న ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రమాద బాధితులకు ఇచ్చిన చెక్కులు చెల్లలేదంటూ కథనం ఇచ్చింది. అధికారుల తీరపై గవర్నర్‌ నరసింహన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు నిధులు మంజూరు అయ్యాయని, తమకు అండగా నిలిచిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here