Featuredజాతీయ వార్తలు

సీజేఐగా జస్టిస్‌ బోబ్డే ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్‌ అర్వింద్‌ బోబ్డే ప్రమాణ

స్పీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఆయన చేత సోమవారం ప్రమాణం చేయించారు. బోబ్డే 17 నెలల పాటు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ గా ఉండనున్నారు. ఏప్రిల్‌ 13, 2021 న ఆయన రిటైర్‌ కానున్నారు. అయోధ్యలో భూవివాదం, రైట్‌ టు ప్రైవసీ వంటి చరిత్రాత్మకమైన తీర్పులను వెలువరించిన బెంచ్‌ లలో జస్టిస్‌ బోబ్డే కీలక పాత్ర పోషించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, జస్టిస్‌ ఎన్వీ రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డేకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లో 1956 ఏప్రిల్‌ 24న జన్మించినారు. తండ్రి లాయర్‌ అరవింద్‌ శ్రీనివాస్‌ బోబ్డే. నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ ఎల్బీ, 1978లో మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ లో లాయర్‌ గా రిజిస్టర్‌ చేసుకున్నారు. 11 ఏళ్లపాటు లాయర్‌ గా సేవలందించారు. 1998లో సీనియర్‌ అడ్వకేట్‌ గా ప్రమోషన్‌ రావటంతో 2000 మార్చి 29న బాంబే హైకోర్టు లో అడిషనల్‌ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 అక్టోబర్‌ 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ప్రమాణం చేశారు. 2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్‌ లభించింది. కాగా ప్రస్తుతం సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close