Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

జూబ్లీహిల్స్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధుర నగర్ వెంగల్ రావు నగర్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు.
జూబ్లీహిల్స్ (ఆదాబ్ హైదరాబాద్) జూబ్లీహిల్స నియోజకవర్గంలోని మధుర నగర్ వెంగలరావు నగర్లో ఎక్కడ చూసినా అక్రమ బిల్డింగ్  నిర్మాణాలు . 80 శాతం బిల్డింగులు లాయర్లు, ఉత్తమ ఉద్యోగులు, బిల్డర్ల , స్వాధీనములో ఉన్నవ. కోట్ల విలువైన స్థలాలు బిల్డింగులు ఏ విధంగా సంపాదించారో కూడా తెలుసుకోకుండా, అధికారులు స్థానిక నాయకులు,  ముడుపులు తీసుకుని వారికి నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నదున ,  అధికారులు ఏమీ చేయలేక అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, గుడిసెలు వేసుకున్న వారికి ఒక్కొక్కరికి 50 వేల నుండి ఒక లక్ష వరకు చెల్లించి వారిని అక్కడి నుండి ఖాళీ చేయించి, వంద గజాల నుండి 500 గజాల వరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, ఎల్ ఆర్ ఎస్ , బి ఆర్ ఎస్, అనుమతులు లేకపోయినా హైటెక్ హంగులతో బిల్లింగ్  లను నిర్మించి, లక్షల్లో కిరాయిలు దండుకుంటున్నారు. ఇంటి పన్నులు  మాత్రం ఒకటి రెండు అంతస్థులు కు మాత్రమే చెల్లిస్తున్నారు. మధుర నగర్, వెంగల్ రావు నగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ,లో రెండు వేలకు పైగా ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు బిల్డింగ్ అభిమానులకు 30 నుండి 50 లక్షల వరకు అడ్వాన్సుగా చెల్లిస్తున్నారు. కిరాయిలు మూడు లక్షల నుండి 5 లక్షల వరకు ప్రతినెలా చెల్లిస్తున్నారు  . సామాన్యులు భార్య పిల్లలతో నివసించాలంటే , సింగిల్ బెడ్ రూమ్ 10000,  డబుల్ బెడ్ రూమ్ 16000, వసూలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వంలో సామాన్యుడు నివసించే పరిస్థితి లేదని, దీనికి కారణం అక్రమంగా బిల్లింగ్ గురించి హాస్టల్స్ కు కిరాయికి ఇచ్చి కోట్లు గడిస్తున్న, టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు స్థానికులు గా ఉంటూ కూడా బస్తీలలో జరుగుతున్న సామాన్యుడు పడుతున్న ఇబ్బందులపై అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళుట లేదని, అక్రమ సంపాద నె, ధ్యేయంగా పెట్టుకొని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు అని స్థానికులు నాయకులపై, తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇంత అసమర్ధ  పాలన గత పాలకులు లేదని చూడలేదని , స్థానికులు విమర్శిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల కొరకు ఏర్పడలేదని, ధనికుల ను పెంచి పోషిస్తున్నారని, అన్నీ బస్తీలలో ని పేదవారు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సామాన్యుడు అంటే ఏమిటో ఓటు ద్వారా గుణపాఠం చెప్పి, టీఆర్ఎస్ నాయకులను ఓడించి తీరుతామని బహిరంగంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏ గల్లీ లో చూసిన ఏదైనా ప్రమాదం జరిగితే, ఫైరింజన్లు గాని, అంబులెన్సులు గాని, వెళ్లే పరిస్థితి లేదని, రోడ్లను, మురికి కాలువలను కబ్జా చేసి , ప్రభుత్వ భూములపై అక్రమంగా బిల్లింగ్ లను నిర్మించి లక్షల్లో కిరాయి వసూలు చేసుకుంటున్నారు. ఒక గంట పా టి వర్షానికి మురికి కాలువలు పొంగి రోడ్లపై పారుతూ, ఇండ్లలోనికి వస్తున్నాయని ,స్థానిక ప్రజలు టిఆర్ఎస్ నాయకుల పై, అధికారులపై బహిరంగంగానే ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఒక ప్రక్క బిజెపి నాయకులు ప్రజల ఆదరాభిమానాలు , సొంతం చేసుకుంటూ ముందుకు పోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం  అన్నివిధాల ప్రజల ఆదరణ కోల్పోతున్న దని, ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు . రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలుస్తుందని, అన్ని బస్తీలలో బెట్టింగులు కాస్తున్నారు  . ఇప్పటికైనా కేటీఆర్ జోక్యం చేసుకుని, అక్రమ బిల్డింగ్ దారులపై, అవినీతికి పాల్పడుతున్న టిఆర్ఎస్ నాయకుల పై, అధికారులపై నిఘా పెట్టి  చర్యలు తీసుకోవాలని, లేని ఎడల టిఆర్ఎస్ ప్రభుత్వానికి సామాన్యులు ఓటుతో గుణపాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు.     

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close