ఇసుకలో జూపల్లి వేలు

0

కొల్లాపూర్‌, (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సంపాదనలో లాభాలు వస్తున్నాయని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలకు భిన్నంగా ఉన్నాయి .వనపర్తి జిల్లా మాజీ మంత్రి జూపల్లి పరిపాలించిన కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలకేంద్రం పరిదిలో ఇసుక మాఫియా అడ్డులేకుండా కొనసాగుతుంది. ఇసుక మాఫి యాను కొనసాగించే ట్రాక్టర్లతో మాజీ మంత్రి జూపల్లి కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆదాబ్‌ న్యూస్‌ వెలుగులోకి తెచ్చింది. గత ఎన్నికల ముందు కొల్లాపూర్‌ మండల పరిదిలోని కృష్ణానది తీర ప్రాంతంలో జరిగిన ఇసుక మాఫియాకు జూపల్లికి సంబందాలు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలోఉన్నప్పుడు ఆరోపనలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. జూపల్లి ఓటమికి ఇసుక మాఫియా కూడా తోడు అయ్యిందని పలు రకాలుగా మాటలు వినిపించాయి . ఇప్పుడు చిన్నంబావి మండల కేంద్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాకు జూపల్లి అండదండలు ఉన్నాయని ఆదాబ్‌ న్యూస్‌ వెలుగులోకి తెచ్చింది . చిన్నంబావి మండల కేంద్రంలో అధికారులు పట్టుకున్నారు . ఈ సందర్భంగా ఆదాబ్‌ న్యూస్‌ చిన్నంబావి మండల కేంద్రంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్‌తో సీక్రేట్‌గా ఆదాబ్‌ న్యూస్‌ వీడియోను సేకరించింది . మంత్రి ఫోన్‌ చేసిండు అధికారులు మాట్లాడుతున్నాడు అంటే ఏ మంత్రి అని విలేకరి అడగగా మాజీ మంత్రి అని ఎస్‌ఐ సురేష్‌ సమాధానం ఇచ్చాడు . ఇది వరకే కొల్లాపూర్‌ మండల పరిదిలో జరిగిన ఇసుక మాఫియాను ఆదాబ్‌ న్యూస్‌ వెలుగులోకి తెచ్చిన సంగతి అందరికి తెలిసిందే . ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి జూపల్లి అధికారులకు ఫోన్‌ చేసి ఇసుక ఎగుమతి చేసిన ట్రాక్టర్ల గురించి అధికారులతో ఫోన్‌లో సంబాషించడంపై సంచలన న్యూస్‌గా మారింది . గురువారం ఎగుమతి చేస్తున్న 14 ట్రాక్టర్లను అధికారులు పట్టుకొని వనపర్తి జిల్లా మైనింగ్‌ ఏడి ట్రాక్టర్‌లో ఎగుమతి చేస్తున్న నిందితులతో మాట్లాడారు . జిల్లా కలెక్టర్‌ స్వేతా మహంతి దృష్టికి తీసుకెళ్తానని ఏడీ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు . ఇసుకను తరలించే నిందితులు ఇంతకు ముందుకు ఇసుకను తరలించినప్పుడు ఎవ్వరు అడగలేదు. గురువారం అడ్డుకున్న సంగతిని అడిగారు . మాజీ మంత్రి అనుమతులు ఉన్నాయని కూడా చెప్పారని అనే మాటలు మాట్లాడారు . మరీ ఇసుక ఎగమతి వనపర్తి జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం అయిన చిన్నంబావి మండల ప్రాంతం నుంచి ఎగుమతి చేస్తుంటే అడిగే అధికారులకే కరువయ్యారు . మైనింగ్‌ ఏడి తెలిపిన విధంగా అధికారికంగా ఇసుక తరలించే వారిని మొదటిసారి పట్టుబడిన వారికి కేసులు నమోదు చేయకుండా ఫైన్‌ విధించే చర్యలు ఉంటాయని తెలియజేశారు . జిల్లా కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here