Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

అమెరికా సాయంతోనే జీహాదీలకు శిక్షణ ఇచ్చాం

1980లో ముజాహీదీన్లకు శిక్షణిచ్చేందుకు సీఐఏ నిధులు సమకూర్చింది

  • ఇదే పాక్‌చేసిన పెద్ద తప్పిందం
  • తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైంది
  • నాటి పాక్‌ పాలకులు యువత భవిష్యత్తును నాశనం చేశారు
  • సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌

ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ శిక్షణనిచ్చిందనే విషయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే అంగీకరించారు. అమెరికా ఇచ్చిన నిధులతోనే వారికి శిక్షణ ఇచ్చామంటూ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. అప్గన్‌ విషయంలో అమెరికా తమని తప్పుబడుతూ ఆరోపణలు గుప్పించడంతో విదేశీ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 1980వ దశకంలో నాటి సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు శిక్షణనివ్వడానికి అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) నిధులు సమకూర్చిందని బాంబు పేల్చారు. ఇది తమ దేశం చేసిన పెద్ద తప్పిదమని అభివర్ణించిన ఇమ్రాన్‌ అన్నారు. దశాబ్దం అనంతరం అప్గన్‌కు అమెరికా తన సేనలను తరలించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని, అప్పట్లో తాము తటస్థంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. అప్గన్‌ యుద్దంలో అమెరికాకు తాముచేసిన సాయమే ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైందని ఇమ్రాన్‌ ఆరోపించారు. ముజాహిదీన్ల పోరాటం కారణంగా తాము 70వేల మందిని కోల్పోయామని, 10వేల కోట్ల డాలర్లు నష్టపోయామని వ్యాఖ్యానించారు. అప్గన్‌లో తమ వైఫల్యాలను అన్ని విధాలుగా నష్టపోయిన తమనే అమెరికా దోషిగా చూస్తోందని మండిపడ్డారు. పాకిస్థాన్‌కు అన్యాయమని జరిగిందని వాపోయారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చి నాటి పాక్‌ పాలకులు యువత భవిష్యత్తుని నాశనం చేశారని దుయ్యబట్టారు. 70ఏళ్ల స్వాతంత్య్రంలో తాము సాధించింది ఏవిూ లేదని, కేవలం ఉగ్రమూకల స్థావరంగా తమ దేశంపై ముద్రపడిందని వ్యాఖ్యానించారు. దేశంలోని జిహాదీ మూకలు తమకు వ్యతిరేకంగా మారాయని, ఈ విషయంలో పాక్‌ తటస్థంగా ఉండాలని తాను బలంంగా భావించినట్టు తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close