జెర్సీ’ హీరోయిన్‌ కొత్త అవతారం

0

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నాని మరోసారి తనదైన శైలిలో నటించి సహజ నటుడు అన్న పేరుకు పూర్తి న్యాయం చేశాడని టాక్‌ వచ్చింది. నాని అద్బుత నటకు తోడుగా ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాద్‌ చాలా బాగా నటించింది. శ్రద్దా నటిగా ఈ చిత్రంతో మరో మెట్టు ఎక్కినట్లయ్యింది. నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ లో దూసుకు పోతున్న శ్రద్దా తాజాగా ఐటెం సాంగ్‌ తో అలరించేందుకు సిద్దం అయ్యింది. జెర్సీ చిత్రంలో చాలా పద్దతిగా ఫ్యామిలీ లేడీగా కనిపించిన శ్రద్దా తాజా ఐటెం సాంగ్‌ లో మాత్రం అందాల ఆరబోత చేసింది. తమిళంలో ఈ అమ్మడు తాజాగా ‘కే13’ అనే సైన్స్‌ ఫిక్చన్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రంలో ఈ అమ్మడి ఐటెం సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందట. పబ్‌ లో ఈ అమ్మడి బిక్కి లిక్కి ఐటెం సాంగ్‌ అదిరిపోయేలా ఉందనే టాక్‌ వచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ పాట యూట్యూబ్‌ లో తెగ హడావుడి చేసింది. భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో శ్రద్దా కమర్షియల్‌ హీరోయిన్‌ గా కూడా గుర్తింపు తెచ్చుకుంటుందట. కెరీర్‌ ఆరంభం నుండి హద్దులు దాటకుండా సినిమాలు చేస్తూ వచ్చిన శ్రద్దా ఇప్పుడు స్కిన్‌ షోకు సిద్దం అయ్యింది. ముద్దు సీన్స్‌ కు కూడా ఈమె ఓకే చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఫ్యామిలీ హీరోయిన్‌ కాస్త మాస్‌ మసాలా హీరోయిన్‌ గా మారింది. తెలుగులో కూడా ఈ అమ్మడి సినిమాలు వరుసగా వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. నటనతో పాటు అందాల ప్రదర్శణ చేస్తే శ్రద్దా కపూర్‌ కు ఆఫర్లు వెళ్లువెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here