అంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మందులు లేకపోయే మల్లన్న పట్టించుకోక పాయే

ఔషధాల కుంభకోణంలో ప్రిన్సిపల్స్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ పాత్ర పై అనుమానాలు? 

  • లేకుంటే ఎందుకు దోషుల పై చర్యలు తీసుకోవడం లేదు? 
  • అయ్యగారికి ఇంత పెద్ద కుంభకోణం నివేదిక అందే వరకు తెలియదా?

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ఈఎస్‌ఐ కార్పొరేషన్కు సుమారుగా 18 లక్షల మంది కార్మికులు బీమా చెల్లిస్తున్న వారికి మెరుగైన వైద్య చికిత్సలు, ఔషధాలు అందించవలసిన బాధ్యతగల ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ గత ఆరు నెలల నుండి మందులు లేక కార్మికులు ఇబ్బందిపడుతున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయం. ఇంత తీవ్రమైన సమస్యకు ముఖ్య కారకులైన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సంచాలకులు దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటస్వామి, డాక్టర్‌ ఆశ రామయ్య, డాక్టర్‌ కె వసంత ఇందిరా, కె నాగలక్ష్మి, హెచ్‌ ఆర్‌ ఆరాధన దేవి పై విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సమగ్రమైన విచారణ చేపట్టి దోషులను నిర్ధారించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదిక సమర్పించి ఏడు నెలలు గడిచిన కూడా, అవినీతి అధికారులు యధాస్థానంలో కొనసాగుతున్న చర్యలు చేపట్టని మంత్రి. ఈ ఎస్‌ ఐ ఆస్పత్రి లలో, డిస్పెన్సరీ లలో మందులు లేక ఇబ్బందిపడుతున్న కార్మిక సమస్యలపై మంత్రి ఒక్కసారైనా సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి పరిశీలించిన దాఖలాలు లేవు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులు మంత్రులు అవుతున్నారు, కానీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయ ప్రవేశం చేసి లబ్ధి పొందాలన్న ఆలోచనలు తప్పించి ప్రజల సంక్షేమం కొరకు, సమాజహితం కొరకు సేవ చేయాలన్న నాయకత్వ లక్షణాలు లేని నాయకులు ఎందుకు అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అసమర్థ నాయకులు, అసమర్థ అధికారులతో సమాజానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని వారు ఆరోపిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ లో అవినీతి అధికారులు కొమ్ము కై స్వార్థ ప్రయోజనాల కోసం రేట్‌ కాంట్రాక్ట్‌ కంటే కూడా 350 శాతం అధిక ధరలు పెట్టి ఔషధాలు కొనుగోలు చేశారు. ఈ విషయం స్పష్టంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ గుర్తించి నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కూడా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడిన వ్యక్తులపై గత ఏడు నెలల నుండి దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డ సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి, బీమా చెల్లిస్తున్న కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారికి పూర్తిస్థాయిలో ఔషధాలు అందించడంలో మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ విఫలమయ్యారు.డిస్పెన్సరీ లలో బ్లడ్‌, షుగర్‌, యూరిన్‌ విశ్లేషణ వంటి అత్యవసర ల్యాబ్‌ ఇన్వెస్టిగేషన్‌ లో, కె ఎఫ్‌ టి, ఎల్‌ ఎఫ్‌ డి వంటి సరళ బయో కెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్‌ లు సిబిసిటి, ఈసీజీ నిర్వహణ సదుపాయాలు ఉండాలి కానీ డిస్పెన్సరీ లో నామమాత్రం వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఒకేసారి ఒక నెలకు సరిపడా మందులు డిస్పెన్సరీ లో ఇవ్వాలి కానీ గత ఆరు నెలల నుండి డిస్పెన్సరీ లో మందులు లేక రోగులు ఎంతో అవస్థ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్నీ ఈ ఎస్‌ ఐ ఆస్పత్రిలో, డిస్పెన్సరీల పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కానీ అసలు కమిటీ ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది, ఎందుకంటే ఇంత తీవ్రమైన సమస్య కార్మికులకు ఎదురవుతుంది అని తెలిసి కూడా కమిటీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్పష్టంగా అర్థం అవుతుంది అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పించి కార్మికుల సంక్షేమం మాత్రం పట్టించుకోవడంలేదని. కార్మిక రాజ్య భీమా చికిత్సలాయాలలో డాక్టర్లు సమయపాలన పాటించకుండా ఇష్టమొచ్చినట్టు రావడంతో పేషెంట్లు గంటలకొద్దీ లైన్‌ లో నిలబడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. హైదరాబాద్‌ జిల్లాలోని పలు డిస్పెన్సరీ లు పై అంతస్తులో ఉండడంతో, లిఫ్ట్‌ సౌకర్యం లేకపోవడంతో సీనియర్‌ సిటిజన్స్‌ రోగులకు మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, డిస్పెన్సరీ వద్ద వీల్‌ చైర్‌ ఏర్పాటు కానీ , వార్డ్‌ బాయ్‌ నియామకం లేక రోగులు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు.

దోషులను వెంటనే ఉద్యోగాల నుండి బర్తరఫ్‌ చేయాలి…..

కాంగ్రెస్‌ నాయకుడు బాబు శ్రీనివాస్‌

విజిలెన్స్‌, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అంశాల వారీగా స్పష్టంగా సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, ఏడు నెలలు గడిచిన దోషులను శిక్షించకుండా రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఉన్నతాధికారి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌. గత రెండు సంవత్సరాల నుండి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న కూడా ఇంత భారీ ఎత్తున ఔషధాల కొనుగోలులో అవినీతిని గుర్తించకపోవడంతో పాటు బీమా చెల్లిస్తున్న కార్మికులకు ఆరు మాసాల నుండి మందులు లేక ప్రాణాంతకమైన రోగాలతో ఇబ్బందిపడుతున్న కూడా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఔషధాల కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డ దోషులపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలి.

కార్మికుల వైద్య సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి……

పేషంట్‌ బందువు

ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతున్న కార్మికులకు ఒక్కరోజు మందులు లేకపోతే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణానికి ముప్పు వస్తుంది. అలాంటిది గత ఆరు నెలల నుండి అందించవలసిన ఔషధాలు అందించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం భారీ ఎత్తున మందుల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకొని, కార్మికులకు పూర్తిస్థాయిలో మందులు అందించవలసిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న విషయంపై కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కి అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం కార్మికుల వైద్య సమస్యలపై ద ష్టి కేంద్రీకరించి సమస్యలను పరిష్కరించాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close