Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

జగన్‌ సార్‌… ఈ ప్రశ్నలకు బదులేది..?

రివర్స్‌ టెండర్స్‌ నిలిచేనా..?

  • మెఘా నుంచి 400 కోట్లు కక్కిస్తారా..?
  • పట్టిసీమ పరిస్థితి..?
  • ఈ లింకుల లంకెలు ఏమిటి..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలుగు రాష్ట్రాల్లో ప్రోజెక్టుల మాటున జరుగుతున్నది ఏమిటి..? లక్షలాది కోట్ల రూపాయల విషయంలో ‘దాగుడు మూతలు’ ఆట ఆడేది ఎవరు..? ఆడించేది ఎవరు..? అస్సలు లాభపడేది ఎవరు..? తెలుగు రాష్ట్రాల సంబంధాల, అనుబంధాల, అనురాగాల మాటున అవినీతి వీణల తీగెలు కర్ణకఠోరంగా విూటేది ఎవరు…? ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన కథనం.

రివర్స్‌ గేర్‌..:

పోలవరం రివర్స్‌ టెండర్లు చెల్లనట్టేనా.! అసలు ఆ జీఓ ఏం చెబుతోంది? ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జలవనరుల శాఖ ఇచ్చిన జీఓ 67 ప్రకారం ఈ టెండర్లు చెల్లవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పిలిచారు సరే.. నిలుస్తారా..?:

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్స్‌, జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి నిర్వహించిన రివర్స్‌ టెండర్లతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి. హెడ్‌ వర్క్స్‌, హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్ను ఒకే ప్యాకేజీగా నిర్ణయించి రూ.4,987 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్‌ 1గా కంపెనీ కోట్‌ చేసిన ధరనే అంచనా వ్యయంగా నిర్ధారించి టెండర్లు ఆహ్వానించింది.

8లో.. 7 వెనక్కి..:

జగన్‌ సర్కార్‌ ‘రివర్స్‌ రికార్డ్‌’.. ఈసారి ఎంత మిగిలిందంటే..! టెండర్లలో 12.6 శాతం తక్కువకు అంటే రూ.4,358 కోట్లకు ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థ మెఘా టెండర్‌ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.628 కోట్లు ఆదా అయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ తరువాతనే పెద్ద చిక్కు వచ్చి పడింది. తొలుత మొత్తం 8 సంస్థలు కాంట్రాక్ట్‌ పై ఆసక్తి చూపినప్పటికీ చివరికి మెఘా సంస్థ ఒక్కటే బిడ్‌ దాఖలు చేసింది. మిగిలిన 7 సంస్థలు తప్పుకున్నాయి. ఇప్పుడిదే ప్రభుత్వానికి సమస్యగా మారబోతుంది.

జీఓ 67లో…:

రివర్స్‌ టెండరింగ్‌ విధానం ప్రకారం కనీసం రెండు సంస్థలైనా బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వమే స్వయంగా విధించిన నిబంధన. జలవనరుల శాఖ ఇచ్చిన జీఓ 67 అదే స్పష్టం చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌ లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలని అందులో ఉంది. దాని ప్రకారం ఒక్కటే బిడ్‌ దాఖలైంది కాబట్టి టెండర్‌ ఖరారు చేసేందుకు వీలుపడదని జలవనరుల నిపుణుల వాదన.

విూం మొనార్కులం..:

‘ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా?’ అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లాలంటే కనీసం రెండు సంస్థలైనా బిడ్లు దాఖలు చేసి ఉండాలి. అలాగైతేనే ఒక సంస్థ ఎల్‌-1గా నిలిస్తే.. మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిబంధనలైతే సవరణలకు అవకాశం ఉండేది. ఇదే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విధానం కావడంతో సదరు నిబంధనలను పాటిస్తారో.. లైట్‌ తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

మెఘా నుంచి ఆ 400 కోట్లు..:

రివర్స్‌ టెండరింగ్‌ ప్రజాధనం ఆదా కోసమే. చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందాలతో ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తోంది. వాటిని అడ్డుకోని ప్రజాధనాన్ని ఆదా చేయటమే ‘రివర్స్‌’ లక్ష్యం. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి నుంచి ఏపీ మంత్రులందరిదీ అదే మాట. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో సింగిల్‌ టెండర్‌ గా వచ్చినా కూడా జగన్‌ సర్కారు మెఘా ఇంజనీరింగ్‌ సంస్థకే పనులు కట్టబెట్టడానికి రెడీ అయింది. ఇదే సంస్థ చంద్రబాబు హయాంలో పట్టిసీమ పనులు కూడా చేసింది. అయితే పట్టిసీమ పనుల్లో మెఘా ఇంజనీరింగ్‌ కు ‘చంద్రబాబునాయుడి సర్కారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకూ దోచిపెట్టింది’ అని సాక్ష్యాత్తూ జగన్మోహన్‌ రెడ్డి నుంచి మొదలుకుని వైసీపీ నేతలు అందరూ ప్రకటించారు. చివరకు కాగ్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. పట్టిసీమలో అడ్డగోలు చెల్లింపులు జరిగాయని నిగ్గుతేల్చింది. మరి ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి సర్కారు మెగా నుంచి పట్టిసీమ కు చెందిన దోపిడీ మొత్తం 400 కోట్ల రూపాయలను కూడా రికవరి చేస్తారా?. లేక వదిలేస్తారా..?

ప్రజాధనం ఆదా చేయటమే అంతిమ లక్ష్యం అయినప్పుడు ఒక కేసులో ఒకలాగా..మరో అంశంలో మరోలా ఎలా వ్యవహరిస్తారు అన్నది మాటువేసి వేచి చూద్దాం.

ఃనీలీ:

ఈ లంకెల లింకేంటి..?

తెలుగు ‘రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల విలువైన పనులను దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలో కెవిపి కుమారుడు ఒక డైరెక్టర్‌. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి వద్ద నిర్మించనున్న మేఘవరం ఎనర్జీ విద్యుత్‌ ప్రాజెక్టులో కూడా కెవిపి కుమారుడు ప్రధాన భాగస్వామి. అంత డబ్బులు కెవిపికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి. సదరు కంపెనీపై చర్యలు తీసుకోకుండా, మళ్లీ అదే కంపెనీకి పట్టిసీమ, కొండవీడువాగు ప్రాజెక్టు, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు ఏవిధంగా ఇచ్చారన్న చర్చ ఉంది. విూడియా సమక్షంలోనే మెఘా, నవయుగ కంపెనీలపై నాయకులు ఆరోపణలు గుప్పించారు. నవగ్రహ కంపెనీలు వైఎస్‌, కెవిపి బినావిూలనే ఆరోపణలు ఉన్నాయి.

కాళేశ్వరం కథ:

రివర్స్‌ టెండర్‌ లో మెఘా ఆంధ్రప్రదేశ్‌ కు బోలెడం మిగిల్చింది.. కదా.. ! అదే విధంగా తెలంగాణలో సేమ్‌ టెండర్‌ వేస్తే… సుమారు 12వేల కోట్లు మిగులుతాయని తెలుస్తోంది. మరోసారి సవివరంగా ఆ వివరాలు నిర్మొహమాటంగా మాట్లాడుకుందాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close