ఆంధ్రా సిఎంగా జగన్‌…

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

ఇద్దరు చంద్రుల ఆట మధ్యలో ఉంది. మొదటి భాగంలో కల్వకుంట్ల చంద్రుడు గెలిచారు. దీంతో తొలి పలుకులోనే… ఆంధ్రా చంద్రుడు గిప్ట్‌ ఇచ్చారు. రిట ర్న్‌ గిప్ట్‌ ఇచ్చి బదులు తీర్చుకుంటానని తెలంగాణ చంద్రుడు చెప్పారు. ఎట్టకేల కు సవాళ్ళు…ప్రతి సవాళ్ళతో ‘రిటర్న్‌ గిప్ట్‌’ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

‘జగన్‌ సిఎం’గా పావులు: నారా చంద్ర బాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల విషయంలో వేలు పెట్టి… కూటమి ఏర్పాటు చేయడం గులాబీ నేతకు నచ్చలేదు. సరికదా ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకునే విధంగా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదపటం.మొదలెట్టారు. అందులో భాగంగా జగన్‌ ను సిఎం చేయాలని గులాబీ నేత పావులు కదుపుతున్నారు.

మొదటి వాక్కు..’రిటర్న్‌ గిప్ట్‌’: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన తర్వాత కేసీఆర్‌ ‘విూట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. తనను ఆంధ్రాకు రమ్మని పిలుస్తున్నారని, వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్కు వెళ్తానని కేసీఆర్‌ మరోసారి ఉద్ఘాటించారు.

మాకే లాభం -చంద్రబాబు : కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ కామెంట్స్పై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్‌ గిఫ్ట్‌ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని ఆయన గుర్తుచేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కూడా కేసీఆర్‌ ప్రకటనపై తనదైన శైలిలో స్పంధించారు. కేసీఆర్‌ ఏపీలో ప్రచారం చేస్తే తమకే లాభమని అభిప్రాయపడ్డారు. రైతులను మెప్పించినవారిదే అధికారమని, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ చాలా చేశారని కొనియాడారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా రైతులకు పంట పెట్టుబడి ఇచ్చారని ఆయన చెప్పారు.

జగన్‌కు అనుకూలంగా అసదుద్దీన్‌: ఏపీకి వెళ్లి జగన్కు మద్దతిస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. ఈసారి టీడీపీ రెండు స్థానాలు కూడా గెలవలేదని అసద్‌ వ్యాఖ్యానించారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని ఆయన విమర్శించారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అసద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్గా మారాయి.

నో(ఓ)టు కేసు..: కల్వకుంట్ల చంద్రుడు చేతిలో ‘నో(ఓ)టు’ కేసు ఉంది. ఆయన అనుకుంటే వేగంగా పావులు కదుపుతారు. అయితే వచ్చే ఎన్నికల సమయంలో ఈ కేసు తెరపైకి వస్తే ఆంధ్రా బాబుకు సానుభూతి వస్తే… అందుకోసం కేసిఆర్‌ ఈ రెస్క్‌ తీసుకోరు.

చివరిగా..: కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రచారానికి ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళనక్కరలేదు. ఓ ప్రెస్‌ విూట్‌ పెడితే చాలు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న అభిమానులకు కొదవలేదు. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసి… చంద్రబాబుని దెబ్బకొట్టాలని ‘గులాబీ దళపతి’ బహిరంగ అంతరంగం. అదే నారా చంద్రబాబు నాయుడుకి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇచ్చే ‘రివర్స్‌ గిప్ట్‌’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here