జాక్‌ పాట్‌ కొట్టింది

0

సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం నవాబ్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చాడు. ఈయన చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ ను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. గత ఆరు నెలలుగా ఈ విషయమై తమిళ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొదట ఈ చిత్రంను భారీ బడ్జెట్‌ తో లైకా ప్రొడక్షన్స్‌ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే 2.ఓ ఫలితమో లేక మరేంటో కాని వారు ఈ ప్రాజెక్ట్‌ ను వదిలేశారు. దాంతో మణిరత్నం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను రిలయన్స్‌ వారికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. మణిరత్నం కథ నచ్చడంతో రిలయన్స్‌ వారు ఈ ప్రాజెక్ట్‌ ను టేకోవర్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు గాను ఐశ్వర్య రాయ్‌ నయనతార అనుష్క త్రిషలతో పాటు ఇంకా పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఆమద్య ఐశ్వర్య పేరు బలంగానే వినిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అమలా పాల్‌ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కెరీర్‌ లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ సక్సెస్‌ లు అందుకోక పోవడంతో పాటు ఈ మద్య కాలంలో ఈమెకు పెద్దగా అవకాశాలే రావడం లేదు. అలాంటి సమయంలో అమలాపాల్‌ కు ఈ చిత్రం జాక్‌ పాట్‌ తో సమానం. సౌత్‌ లోనే కాకుండా నార్త్‌ లో కూడా మంచి క్రేజ్‌ ఉన్న దర్శకుడు మణిరత్నం ఈ చిత్రంను బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లనున్నాడు. పౌరాణిక నేపథ్యంలోని కథతో ఈ చిత్రం రూపొందబోతుంది. ఇలాంటి పౌరాణిక పాత్రకు అమలా పాల్‌ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మణిరత్నం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్ని కూడా ఆనోట ఈనోట బయటకు వచ్చినవే. త్వరలోనే పొన్నియన్‌ సెల్వన్‌ గురించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here