Featuredరాజకీయ వార్తలు

ప్రాజెక్టుల రీ డిజైన్‌ కాదు అది దోపిడి డిజైన్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్‌ కమిషన్‌ రావుగా మారారని, ప్రజాధనాన్ని లూటీ చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షు డు రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ. 40 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. సోమ వారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రహమత్‌ నగర్‌లో ప్రజాకూటమి సభలో ఆయన మాట్లాడుతూ రూ. 50 వేల ప్రాజెక్ట్‌ను రూ. 90 వేలకు పెంచారని, కవిూషన్లు తినేసి కేసీఆర్‌ కవిూషన్‌రావు అయిపోయారని విమర్శించారు. ప్రతి కుటుంబం నెత్తివిూద రూ.రెండున్నర లక్షల అప్పుపడిందని రాహుల్‌ ఆరోపించారు. కేసీఆర్‌ తనయుడి ఆస్తి మాత్రం 400 రెట్లు పెరిగిందన్నారు. ఇండియా సూపర్‌ పవర్‌గా ఎదుగుతోందని.. అమెరికాలాంటి దేశాలు చెప్పాయి అంటే అందుకు హైదరాబాదే కారణమని.. హైదరాబాద్‌ను అలా తీర్చిదిద్దింది చంద్రబాబేనని రాహుల్‌ కొనియాడారు. నాలుగున్నరేళ్లుగా హైదరాబాద్‌ అభివృద్ధి ఏమైందని రాహుల్‌ ప్రశ్నించారు. చెమట చిందించి సాధించుకున్న రాష్ట్రం వచ్చాక… హైదరాబాద్‌లో యువత పరిస్థితి ఏమైంద న్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో… కేసీఆర్‌ బీజేపీ అభ్యర్థిని ఎందుకు సమర్థించారని రాహుల్‌ ప్రశ్నించారు. మోదీ విధానాలు దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తే… అలాంటి మోదీని కేసీఆర్‌ సమర్థిస్తూ వచ్చారని ఆయన దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటే అని చెప్పడానికి ఇంతకంటే ఏంకావాలని రాహుల్‌ అన్నారు.

బీజేపీకి అసలు సంబంధమే లేదని, ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం పోటీ చేసిందని రాహుల్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో మెట్రో రైలును అడ్డుకుంది ఎంఐఎం పార్టీనేనని ఆయన విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ లక్ష్యం మోదీని బలపర్చడమేనని, ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్‌ ఉండాలన్నదే వారి కోరికని రాహుల్‌ అన్నారు. తెలంగాణ రిమోట్‌ మోదీ దగ్గర ఉందని.. అక్కడ మోదీ రిమోట్‌ నొక్కితే ఇక్కడ కేసీఆర్‌ పనిచేస్తారని రాహుల్‌ విమర్శించారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశం కోసం 37 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్‌తో కలిశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం కలిసి పనిచేద్దామంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందుకు రాలేదని ఆయన ఆరోపించారు. దిల్లీ మోదీ, జూనియర్‌ మోదీ విపక్షాలను భయపెడుతున్నారంటూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లను దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్‌లో ప్రజాకూటమి అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఐ జాతీయ నేత నారాయణతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు సరిగా నీళ్లు లేనప్పుడు మంజీరా, నాగార్జునసాగర్‌ నీళ్లు తీసుకొచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో సమర్ధంగా పాలన చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితే ఉండదని చంద్రబాబు అన్నారు. భాజపా పాలనలో ఏ వర్గానికీ మంచి జరగలేదని విమర్శించారు. స్విస్‌ బ్యాంకుల్లోని నల్లధనాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఫోన్‌లో మాట్లాడాలంటే భయపడే రోజులను తీసుకొచ్చారని కేసీఆర్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్‌, సైబరాబాద్‌లను అప్పగిస్తే ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదన్నారు. తాను ఏ ప్రాజెక్టుకూ అడ్డుపడలేదని, తెలుగుజాతి ఐకమత్యంగా

ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని తానేనని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలవాలని.. ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టాలని ప్రజలను కోరారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్‌ తనను తిడుతున్నారని, తనను తిడితే ఓట్లు పడతాయని ఆయన భావిస్తున్నారని.. తనను తిడితే ఓట్లు పోతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం హావిూని నిలబెట్టుకోవడంలో తెరాస విఫలమైందని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. దివంగత పీజేఆర్‌.. జూబ్లీహిల్స్‌ ప్రజలు, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ఆయన తనయుడు విష్ణువర్ధన్‌ను గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌లోని అన్ని స్థానాల్లోనూ ప్రజాకూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల కోసమే నేను తెలంగాణకు వచ్చానని అన్నారు. ప్రత్యర్థులపై దాడులకు ప్రధాని కార్యాలయమే కేంద్రబిందువు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. తెలుగుజాతి కోసం పనిచేద్దామంటే కేసీఆర్‌ వేరుగా చూస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హావిూలను కూడా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సాధించుకోలేపోయారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్‌.. ఎస్సీని సీఎం చేస్తానంటే తాను అడ్డుపడ్డానా అని ప్రశ్నించారు. దళితులకు భూమి ఇస్తానంటే తాను అడ్డుపడ్డానా.. కేసీఆర్‌ అధికారాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. తాము ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా అడ్డుపడలేదని, దేశంలో ఎవరికీ లేని వనరులు తెలంగాణలో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌ దుష్టపాలనను అంతం చేస్తామని సీపీఐ నేత నారాయణ అన్నారు. ప్రజాకూటమి సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌, ఎంఐఎం మెట్రోకు వ్యతిరేకమని విమర్శించారు. చార్మినార్‌కు వెళ్లి నేను సీఎంనని కేసీఆర్‌ చెప్పగలరా? అని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్‌ బీజేపీ అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్‌ని ఓడిస్తేనే.. కేంద్రంలో మోదీని ఓడించగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11న కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి పోయి వంకాయలు కోసుకోవాల్సిదేనని నారాయణ జోస్యం చెప్పారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close