ఆర్సీబీని విడిచి వెళ్లడం బాధగా ఉంది

0

బెంగళూరు : ఆర్సీబీ జట్టును మధ్యలోనే వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ మోయిన్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు తన స్వదేశమైన ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. అయితే, ఇప్పుడే విజయాల బాట పట్టిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టును వదిలి వెళుతుండటంపై విచారం వ్యక్తం చేశాడు. ‘మా జట్టులో ఎక్కువగా కుడి, ఎడమ బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యం సఫలమైంది. అయితే పరిస్థితులను బట్టి ఏస్థానంలో రావడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. బ్యాటింగ్‌కు రావడం.. పరుగులు చేయడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంటారు. డేల్‌ స్టెయిన్‌ రాక జట్టుకెంతో బలాన్ని ఇచ్చింది. పవర్‌ ప్లేలో వికెట్లు తీయడం ఏ జట్టుకైనా కీలకం. ఆ సమయంలో కనీసం నాలుగు వికెట్లు తీస్తే విజయం సులభమవుతుంది. అలా పవర్‌ ప్లేలో వికెట్లు తీసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. పవర్‌ ప్లేలో స్టెయిన్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు. అందుకే స్టెయిన్‌ ప్రభావం జట్టుపై చాలా ఉంటుంది. బెంగళూరులో ఉన్నది చాలా చిన్న మైదానం. బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడం పేస్‌ బౌలర్లకు చాలా కష్టమైన పని. గత మ్యాచ్‌లో రసెల్‌కు బౌలింగ్‌ వేసే అవకాశం నాకు రాలేదు. అయితే, ఒక్కసారి విజయాల బాట పడితే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు’ అని అలీ పేర్కొన్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలను బెంగళూరు దాదాపు కోల్పోయింది. అయితే, అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి, వాతావరణం సహకరిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే 10 మ్యాచులాడిన ఆ జట్టు 3 విజయాలు మాత్రమే సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here