ఆర్‌ ఆర్‌ ఆర్‌ లేట్‌ కాక తప్పదా ?

0

వెండితెర ఇంద్రజాలికుడు రాజమౌళి ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు ఆదిలోనే అడ్డంకులు తప్పడం లేదు. ఊహించని విధంగా రామ్‌ చరణ్‌ కు గాయం కావడంతో ఇప్పటికే ఒక బ్రేక్‌ తో సతమవుతూ ఉండగా తారక్‌ కు సైతం చిన్న దెబ్బ తగిలిందన్న వార్త వైరల్‌ అయిపోయింది. ఇదిలా ఉండగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన గతంలో ఎంపిక చేసిన డైసి ఎడ్గార్‌ జోన్స్‌ తప్పుకోవడం జక్కన్నకు పెద్ద టెన్షన్‌ గా మారినట్టు సమాచారం.

చరణ్‌ కు అలియా భట్‌ సెట్‌ అయిపోయింది కాని తారక్‌ కు తగ్గ జోడిని వెతికి పట్టుకోవడంలో జరుగుతున్న ఆలస్యం అతన్ని బాగా టెన్షన్‌ పెడుతోందట. నిన్నటి దాకా సాహో ఫేం శ్రద్ధా కపూర్‌ పేరు వినిపించింది కాని తనకున్న కమిట్‌ మెంట్స్‌ ద ష్ట్యా ఇది చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఏదో పరిణితి చోప్రా అన్నారు కాని కొంచెం ముదురుగా అనిపించే ఈ భామ జూనియర్‌ పక్కన సెట్‌ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు శ్రీలంకన్‌ బ్యూటీ బాలీవుడ్‌ సుందరి జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు మరో టాక్‌ వచ్చింది. కథ ప్రకారం జూనియర్‌ చేస్తున్న భీమ్‌ పాత్ర ప్రేమించేది బ్రిటిష్‌ అమ్మాయిని. ఆ పాత్రకు పాశ్చాత్య లక్షణాలున్న మోడల్‌ అయితేనే సూటవుతుంది. లేదంటే కథనే మార్చాల్సి వస్తుంది. అమీ జాక్సన్‌ పర్ఫెక్ట్‌ ఛాయస్‌ గా నిలిచేది కాని తను ఇప్పుడు గర్భవతి. సో నో ఛాన్స్‌.

మరి జాక్వలిన్‌ ని ఓటు వేస్తారా లేక మార్పులు చేసి మరో బాలీవుడ్‌ హీరొయిన్‌ నే దిగుమతి చేస్తారా ఇదంతా తేలడానికి టైం పట్టేలా ఉంది. దీని వల్లే ఆర్‌ ఆర్‌ ఆర్‌ లేట్‌ అయ్యేలా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఫిక్స్‌ చేసుకున్న రిలీజ్‌ డేట్‌ వచ్చే ఏడాది జూలై 31 రీచ్‌ కావడం కష్టమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here