25న పోలింగా?

0

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జనవరి 25న నిర్వహించే రెండోవిడత పోలింగు తేదీని మార్చాలని ఉపాధ్యాయుల నుంచి డిమాండు పెరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటివిడత పోలింగు ఈ నెల 21న, రెండో విడత 25న, మూడోవిడత 30వ తేదీన నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఎప్పటిలా ఉపాధ్యాయులకు ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులుగా వివిధ బాధ్యతలను అప్పగించనున్నారు. వేల మంది ఉపాధ్యాయులు ఈ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, మిగతావారు భాషా పండితులు. వీరిలో సీనియర్లకు ప్రిసైడింగు అధికారులుగా, జూనియర్లకు సహాయ ప్రిసైడింగు అధికారులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు అప్పగిస్తారు. వీరంతా ఎన్నికల తేదీకి ఒకరోజు ము ందు 24వ తేదీ పోలింగు కేంద్రాల వద్దకు వెళ్లాలి. పోలింగు సామగ్రి అందుకొని  25వ తేదీన ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగు సందర్భంగానూ విధులు నిర్వహించాలి. దీంతో 25న బాధ్యతల నుంచి బయటకు రావడానికి రాత్రి అవుతుంది.

ఇదీ సమస్య: తెల్లారితే 26వ తేదీన రిపబ్లిక్‌ దిన వేడుకలను నిర్వహించాలి. 25వ తేదీ రాత్రిదాకా ఎన్నికల విధులు నిర్వహించి మరుసటిరోజు ఉదయాన్నే గణతంత్ర దిన వేడుకల్లో ఎలా పాల్గొనాలన్న సందేహాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన బహుమతు ల ఏర్పాట్లు చూసుకోవాలి. ఇప్పటికే ఎన్నికల విధుల్లో భాగంగా అందించే శిక్షణలకు పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరవుతు ండటంతో స్కూళ్లను నడిపే పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు : గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగును ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల్లో 80 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలలే పోలింగు కేంద్రాలుగా ఉన్నాయి.

పోలింగు జరిగే 25వ తేదీకి ఒక్కరోజు ముందే ఎన్నికల అధికారులు ఆ పాఠశాలలను తమ అదుపులోకి తీసుకుం టారు. దీంతో గణతంత్ర వేడుకల ముస్తాబుకు అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు అవకాశం ఉండదు. క్రీడాపోటీల వంటివి నిర్వహించుకోడానికి వీలు లేదు. 

కొసమెరుపు: లక్షలాది ఓట్లు గల్లంతు అయితే ఓ ‘సారీ’ చెప్పి దొరల్లా తిరిగే అధికారులు పోలింగ్‌ తేదీ మారుస్తారు అనుకోవడం అత్యాశే..! పాపం గురువులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here