Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

దేశ రక్షణపై కాంగ్రెస్‌కు బాధ్యతలేదా?

పాక్‌కు సాయం చేయడానికి సిగ్గుండాలి

  • ఉగ్రవాదంపై చివరి అస్త్రం ప్రయోగించాం
  • కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ

దేశ రక్షణపై కాంగ్రెస్‌కు బాధ్యతలేనట్లు వ్యవహరిస్తుందని, పాక్‌కు సాయం చేస్తున్నందుకు కాంగ్రెస్‌కు కనీసం సిగ్గుకూడాలేదని కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రంలోని దాద్రా అండ్‌ నగర్‌ హవేలీలో ఆదివారం జరిగిన ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. ఈ అంశంపై ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా విపక్షాలు అండగా నిలబడాలని హితవు పలికారు. భారతదేశ సమగ్రతకు 370, 35ఏ అధికరణలు అవరోధంగా నిలుస్తున్నాయని, ప్రధాని మోడీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఈ అధికరణలను రద్దు చేశారని అమిత్‌షా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయని అన్నారు. ఉగ్రవాదంపై చివరి అస్త్రం ప్రయోగించామని, ప్రభుత్వం తీసుకున్న చర్యకు కొద్ది మంది మినహాయిస్తే దేశ ప్రజలంతా ఆమోదం తెలిపారని షా చెప్పారు.

రాహుల్‌ గాంధీపై అమిత్‌షా విరుచుకుపడుతూ, 370 అధికరణ రద్దను కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని, ఇవాల్టికి కూడా రాహుల్‌ గాంధీ ఏ ప్రకటన చేసినా అది పాక్‌ను ప్రశంసించేవిగానే ఉంటున్నాయని అన్నారు. ఐక్యరాజ్యసమితికి పాక్‌ చేసిన విజ్ఞప్తిలోనూ రాహుల్‌ ప్రకటన ఉందని, ఇండియాకు వ్యతిరేకంగా చేస్తున్న ఇలాంటి ప్రకటనలకు కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలని అమిత్‌షా దుయ్యబట్టారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close