భారతదేశానికి… క్రీస్తు వచ్చారా..?

0

అనంచిన్ని వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌)

క్రైస్తవులకు ఆయన బాట వేదం. ఆయనే వారికి సర్వసం. పవిత్ర బైబిల్‌ వారికి మార్గదర్శం. ప్రపం చంలో ఏ మత ప్రాతిపదికన కాల కొలమానం తీసుకున్నా క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అంటూ రెండు భాగాలుగా చూస్తోంది. అంతటి మహనీ యుడు భారతదేశంలోని కాశ్మీర్‌ వచ్చారా..? ఆయ న విూదే వచ్చే విమర్శలు కోకొల్లలు. వాటికి తెర దించుతూ.. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.

ఏసుక్రీస్తు జీవితంలో ఆ 13 ఏళ్ళు ..: ఏసు క్రీస్తు జీవనకాలంలో పురాతన బైబిల్‌ ప్రకారం 13వ ఏట నుంచి 30 ఏళ్ళ ప్రస్థావన కనిపించదు. ఈ 17 సంవత్సరాలు ఏసుక్రీస్తు జీవితం మిస్టరీనే. అయితే ఆ 17 ఏళ్ళు ఏసు క్రీస్తు ప్రజల జీవిత సమస్యలను వివిధ రూపాల్లో తీర్చారని క్రైస్తవులు ప్రగా ఢంగా నమ్ముతారు. ఈ విషయంలో వారు ప్రాంతాలు, దేశాలు, బాషల కతీతంగా ఒకే నిశ్చిత ఏకాభిప్రాయం, నమ్మకం కలిగి ఉండటం విశేషం.

కాశ్మీర్‌ కు క్రీస్తు వచ్చారు. ఇవీ ఆధారాలు.?: కాశ్మీరుకు జీసస్‌ క్రీస్ట్‌ వచ్చాడు. తపస్సు చేశాడని ”ది అన్‌ నోన్‌ లైఫ్‌ ఆఫ్‌ జీసెస్‌ క్రైస్ట్‌” అనే గ్రంధంలో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్‌ భాషలో రాయబడి భద్రపరచబడిన వ్రాతప్రతిలో ఈ విషయం ఉందని కాశ్మీర్‌ లో ప్రచారం లో ఉంది.తర్వాత దీన్ని ఒక రష్యన్‌ రచయిత రష్యన్‌ భాషలోకి అనువదిస్తే తర్వాత ఇంగ్లీష్‌ లోకి పైన చెప్పిన పేరుతో అనువదించారు. ఇక్కడి హిమాలయ ప్రాంతవాసులందరూ ఏసుక్రీస్తు ఇక్కడికి వచ్చి మెడిటేషన్‌ చేశాడనే నమ్ముతారు. కాదని ఎవరూ అనలేరు. దీనికి కారణాలు 3 ఉన్నాయని అక్కడి గైడ్‌ లు తెలియజేస్తారు.

1). జీసెస్‌ ధరించిన దుస్తులు అచ్చంగా కాశ్మీరీలు ధరించిన దుస్తువుల వంటివే.

2). ఆయన జుట్టు శైలి కూడా కాశ్మీరీ తరహాలో ఉంటుంది.

3). ఆయన ప్రదర్శించిన మహిమలు అచ్చంగా కాశ్మీర్‌ లోని తంత్ర విద్యా మహిమలే. జీసెస్‌ తన 13 వ ఏటా ఆసియా మైనర్‌ ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఎక్కడికి వెళ్లిందీ ఎవరికీ తెలియదని, కానీ ఆయన కాశ్మీర్‌ లోయకు వచ్చి 30 వ ఏడు దాకా అంటే 17 ఏళ్ళు ఉండిపోయాడానన్నది యదార్ధమని భావిస్తారు. ..జీసెస్‌ తపస్సు చేసినట్లు చెప్పబడే ఒక చిన్న ప్రార్ధనామందిరం ఎత్తైన పర్వతం విూద కనిపిస్తుంది. దీనినే ఏసుక్రీస్తు ప్రార్ధనామందిరం అంటారు. కాశ్మీర్‌ లో ఒక చోటు నుంచే జీసస్‌ స్వర్గానికి వెళ్లాడని, అక్కడ సమాధి నిర్మించబడి ఉన్న ప్రదేశాన్ని ”రోజా బాల్‌ ” అంటే గౌరవ సమాధి (అనర్డ్‌ టుంబు ) అని అర్ధమని, దీన్ని

క్రైస్తవులతో పాటు మహమ్మదీయులు కూడా నమ్మటం గమనార్హం.

తెరుచుకున్నజీసస్‌ సమాధి-ఆశ్చర్యం: ఏసుక్రీస్తు సమాధిని కొన్ని శతాబ్దాల తర్వాత తొలిసారిగా పరిశోధకులు కదలించారు.శతాబ్దాల తర్వాత తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. జెరూసలేం పాత పట్టణం వెలుపల ఒక గుహ వద్ద శిలా సమాధి (ద ¬లీ సెపుల్కర్‌)పై ఉంచిన చలువరాయిని తొలగించారు. సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యలో భాగంగా సమాధిపై ఉన్న చలువరాయిని తొలగించారు. మతపెద్దల సమక్షంలో పరిశోధకులు ఈ చలువరాతిని అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీ.శ 1555 నుంచి క్రీస్తును సమాధి చేసిన తర్వాత ఈ పవిత్రమైన చలువరాతిని ఏనాడూ కదిలించలేదు. శిలువ విూద మరణించిన ఏసుక్రీస్తును ఇందులో ఉంచారని, సమాధి చేసిన మూడో రోజే ఆయన పునరుత్ధానం చెందింది కూడా ఇక్కడి నుంచేనని క్రైస్తవుల విశ్వాసం. క్రీ.శ. 1555లో సమాధిపై ఉంచిన పాలరాతిని ఆ తర్వాత ఎన్నడూ కదలించలేదు. అందుకు అనుమతి కూడా లేదు. అంతంటి సహసం చేయడానికి ఏవ్వరూ చేయలేకపోయారు.

అయితే తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే పరిశోధకులు దీనిని తెరిచారు. ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగస్వామిగా ఉన్న ‘నేషనల్‌ జియాగ్రాఫిక్‌ సొసైటీ ఆర్కియాలజిస్ట్‌ ఫెడ్రిక్‌ హైబర్ట్‌’ మాట్లాడుతూ ‘సమాధిపై కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాం’ అన్నారు. సుదీర్ఘకాలంగా జరిపిన శాస్త్రీయ విశ్లేషణ అనంతరం సమాధిపై ఉంచిన చలువరాయిని సంప్రదాయరీతిలో తొలగించామని, ఇందవల్ల సమాధిని అందరూ ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగిందని, దీని కిందే క్రీస్తును ఉంచారని ఆయన తెలిపారు. క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం జీసస్‌ పార్ధివ శరీరాన్ని ఒక షెల్ఫ్‌ లేదా బరియల్‌ బెడ్‌ విూద ఉంచారు. అలా చేసిన మూడు రోజుల తర్వాత క్రీస్తు ఇక్కడి నుంచే పునరుత్ధానం చెందారని చెబుతారు. కాగా, క్రీస్తును సమాధి చేసిన ప్రాంతం చుట్టూ ఓ చర్చిని నిర్మించారు. సమాధి మధ్యలో ఓ చిన్న కట్టడాన్ని నిర్మించారు. దీన్ని ‘ఎడిక్యూల్‌’ అంటారు. ఇందులో ఒకసారి అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 1808-1810 మధ్యలో దీన్ని చివరిసారిగా పునరుద్ధరించారు. తాజాగా దీనిని మరోసారి నవీకలణ చేయనున్నారు. చీఫ్‌ సైంటిఫిక్‌ సూపర్వైజర్‌ ప్రొఫెసర్‌ ఆండోనియో మోరోపౌలోవ్‌ నిర్దేశకత్వంలో నేషనల్‌ టెక్నాలకీ యూనివర్శిటీ ఆప్‌ ఎథేన్స్‌ పరిశోధకులు ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ది ¬లీ సెపుల్కర్ను కాన్స్టాంటైన్‌ చక్రవర్తి తల్లి సెయింట్‌ హెలీనా కనుగొన్నారు. నాలుగవ శతాబ్ది నుంచి ఒక చర్చి వెలసి ఉందనే ప్రచారం ఉంది. క్రీస్తు సమాధి దగ్గర చర్చిని తిరిగి ఆద్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత తగ్గకుండా నవీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరవడం వల్ల క్రీస్తు పార్థీవ దేహాన్ని ఏ రాయి విూద పెట్టారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. పరిశోధకులు మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఏస్తుక్రీస్తు వివాహం కాలేదనే విషయం కూడా నిర్ధారణ జరిగే అవకాశం ఉంది.

కాశ్మీర్‌ సమాధులు వీరివే. :కాశ్మీర్‌, శ్రీనగర్‌ లో ఏసుక్రీస్తుకు సంబంధించిన సమాధుల గురించి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ పూర్తి వివరాలు సంపాదించింది. విూర్జా గులాం అహ్మద్‌ అనే తాను స్థాపించిన ‘అహ్మదీయ ముస్లిం ఖమైతా’ సంస్థ ప్రచారం కోసం చాలా తెలివిగా ఏసుక్రీస్తు సమాధుల విషయాన్ని, క్రీస్తు మత వ్యతిరేక ప్రచురుణలను సేకరించి ప్రాచుర్యం పొందడానికి ఉపయోగించుకున్నారు.

అయితే ఇందులోని సమాధులు ముస్లిం సమాధులను పోలి ఉండటం గమనార్హం. ఇప్పటికీ అక్కడ ముస్లిం మతాచారం ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కీ.శ. 400వ సంవత్సరంలో ముస్లిం మత ప్రబోధకులు విూర్జా సయ్యద్‌ నజీరుద్దీన్‌ సమాధి ఒకటి. కాగా మరొకటి మధ్య యుగానికి చెందిన ‘జ్హరతి హజ్రత్‌ ముజీ ఆసీఫ్‌’ (రోజ్‌ బుల్‌) సమాధులుగా తెలిసింది. ముజీ ఆసీఫ్‌ అనే పదానికి విదేశీ బాషలో జీసెస్‌ క్ట్రీస్‌ అనే అర్థం అండటంతో చాలా తేలికగా కొద్ది రోజులు ప్రజలను ఇదే జీసెస్‌ సమాధిగా నమ్మించారు. దీనికి తోడుగా భారత్‌ రలో రెండు వారాల పాటు సందర్శించిన ‘హల్‌ గర్‌ క్రీస్టిఎన్‌’ అనే వ్యక్తి ‘జీసెస్‌ లైవ్డ్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకం జీసస్‌ కాశ్మీర్‌ సందర్శించాడనే పుకార్లకు ఊతమిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here